Advertisement
ఇండస్ట్రీ లోకి రాకముందు నుండే ఎన్టీఆర్ కు విశ్వనాథ్‌తో పరిచయం ఉందన్నారు.
గుంటూరు ac కాలేజ్ లో ఇంటర్, హిందూ కాలేజ్‌లో డిగ్రి చదివారు విశ్వనాథ్. హిందూ కాలేజ్‌లో చదువుతున్న రోజుల్లో ఎన్టీఆర్ ఆయనకు సీనియర్. చదువు పూర్తయిన వెంటనే గుంటూరు సబ్ రిజిస్ర్టార్ ఆఫీస్ లో ఉద్యోగంలో చేరారు ఎన్టీఆర్. ఆయన రోజు విజయవాడ నుండి ట్రైన్ లో గుంటూరు వస్తుండేవారు. ఇదే ట్రైన్ లో కాలేజీకి విశ్వనాథ్ కూడా వెళ్లేవారు. అలా రైలులో ఏర్పడ్డ పరిచయం వీరిది.
Advertisement
Advertisement
ఆ తర్వాత NTR మద్రాస్ వెళ్లి సినిమా హీరో అయ్యారు. విశ్వనాథ్ వాహినీ స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ గా చేస్తున్నారు. ఈ స్టూడియోలోనే తరచూ కలుసుకుంటూ పాత పరిచయాలను కొనసాగించారు. విశ్వనాథ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన నాలుగో మూవీ ‘చిన్ననాటి స్నేహితులు. ఈ మూవీ నిర్మాణంలో జరిగిన ఓ సంఘటన కారణంగా ఎన్టీఆర్ మరియు విశ్వనాథ్‌ల మధ్య దూరం పెరిగింది. ఈ చిత్రం కోసం ఓ సన్నివేశాన్ని కూడా చిత్రీకరిస్తున్నారు.
కూలింగ్ గ్లాసెస్ తో ఎన్టీఆర్ సెట్లోకి వచ్చారు. ఇది సెంటిమెంట్ సీన్ కాబట్టి నల్ల కళ్లజోడు ఉంటే బాగుండదని అభ్యంతరం చెప్పారు విశ్వనాథ్. పరవాలేదు బాగుంటుందని అన్నారు ఎన్టీఆర్. దింతో వీరిద్దరి మధ్య వాదన పెరిగింది. ఇదంతా గమనించిన నిర్మాత dvs రాజు, విశ్వనాథ్‌కు నచ్చజెప్పారట. నల్లకళ్ల జోడుతోనే NTR ఆ షూట్ లో పాల్గొన్నారు.
also read: