Advertisement
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్లలో ఒకరైన కే.విశ్వనాథ్ మరణవార్త తెలిసి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కే.విశ్వనాథ్ చికిత్స తీసుకుంటూ నిన్న రాత్రి 11 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. కే.విశ్వనాథ్ మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అనే సంగతి తెలిసిందే.
Advertisement
Read Also : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ ఇందులో ఎన్ని హిట్ అంటే ?
టాలీవుడ్ సినీ ప్రముఖులు కే.విశ్వనాధ్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. కే.విశ్వనాథ్ సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీకి గర్వకారణం అని, ఆయన మరణం విచారానికి గురి చేసిందని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని బాలయ్య ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. కే.విశ్వనాథ్ మృతి గురించి మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశ్వనాథ్ గారు కాలం చేయడం నన్ను కలచి వేసిందని చిరంజీవి పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని చిరంజీవి కామెంట్ చేయడం గమనార్హం.
Advertisement
అయితే ఆయన చనిపోవడానికి కొన్ని గంటల ముందు కె.విశ్వనాథ్ నిన్న శంకరాభరణం మూవీ రిలీజ్ అయిన రోజు కావడంతో ఒక పాట రాయాలని అనుకున్నారు. అయితే తన ఆరోగ్యం సహకరించకపోవడంతో కొడుకును పిలిచి తన పాటకు అక్షర రూపం ఇవ్వాలని ఆయన సూచించారు. ఆ పాటని ఎలాగైనా పూర్తి చేయాలనే ఆలోచనతో పాట చెబుతూనే విశ్వనాథ్ నిద్రలోకి జారుకున్నారని, ఎంత పిలిచిన లేవకపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించాలని సమాచారం. ఎంతోమంది నటులు కెరీర్ లో సక్సెస్ కావడానికి కె.విశ్వనాథ్ తనవంతు సహాయం చేశారు.
Read Also : యాక్సిడెంట్ తరువాత డ్రైవర్ తో పంత్ మాట్లాడిన మొదటి మాట ఇదే! వింటే కన్నీళ్లు ఆగవు..