Advertisement
వ్రీనీ ఖన్నా, హితేన్ ఎనిమిదేళ్లు ప్రేమించుకున్నారు.. చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.. కానీ వారి ప్రేమకథ అందరిని కంటతడి పెట్టిస్తోంది. వివాహానికి ఒక నెల ముందు, హితేన్ ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. మెదడుకు బలమైన గాయం కావడంతో కోమాలోకి వెళ్లాడు. బతకడం కష్టమని వైద్యులు చెప్పారు. అయితే, వ్రీనీ ఖన్నా మాత్రం అతడిని వైద్య సంరక్షణలో ఉంచింది. హితేన్ పరిస్థితి చూసి అందరూ షాక్ అయ్యారు.. వ్రీనికి అతడిని మర్చిపోవాలంటూ హితవు చెప్పారు.
Advertisement
కానీ, ప్రియుడిపై ఉన్న ప్రేమతో అతడిని బతికించుకునేందుకు పోరాడింది. చివరకు 3 నెలల వైద్య చికిత్స తర్వాత హితేన్ కోమా నుంచి బయటపడ్డాడు. కానీ, ఈ మూడు నెలల్లో దాదాపు 30 కిలోల బరువు తగ్గాడు. అతను తనంతట తానుగా నడవలేడు. అతను తనంతట తానుగా ఏ పనీ చేయలేడు.. అతను బ్రతికి ఉన్నప్పుడు, వ్రీని సంతోషంగా అతనిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ ఇప్పుడు అతను అలా ఉండడంతో అతడితో వివాహం వద్దు అంటూ ఆమె కుటుంబ సభ్యులు నచ్చ చెప్పారు.
Advertisement
కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా ఆమె ఎవరి మాట వినలేదు. ఆ తర్వాత, వారి వివాహం 6 జూలై 2022న జరిగింది. ఇదంతా వ్రీని హితేన్ ప్రేమ యవరా అనే సోషల్ మీడియా ఖాతా ఇన్స్టాలో పోస్ట్ చేయబడింది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయిపొయింది. అఫీషియల్ పీపుల్ఆఫ్ఇండియా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వీడియో పోస్ట్ చేసిన నాలుగు గంటల్లోనే ఈ వీడియోను దాదాపు 1.7 లక్షల మంది లైక్ చేశారు. వేలాది మంది నెటిజన్లు వ్రీ మరియు హితేన్ల ప్రేమకి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వ్రీ ప్రేమ, సహనానికి అందరు అచ్చెరువొందారు. ఆమెను వేనోళ్ళ కీర్తిస్తున్నారు.
మరిన్ని..
లోకేష్ అరెస్ట్ కి రంగం సిద్దమైందా? బరిలోకి దిగనున్న బ్రాహ్మణి?
మొదటి సారి CBN అరెస్ట్ పై స్పందించిన రేవంత్ ! KTR కు ఇచ్చిన కౌంటర్ మాములుగా లేదుగా !
స్కంద సినిమాకు అదే మైనస్ అయ్యిందా? లేకుండా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకునేదా?