Advertisement
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్లు ఇన్నాయి. కొంత మంది దగ్గర విలువైనవి ఉంటే, మరికొంత మంది నార్మల్ వి ఉంటాయి. అయితే.. ఈ ఫోన్లు ఒకవేళ పోతే, లేక ఎవరైనా చోరీ చేస్తే ఎలా ? దీనిని ఆలోచించే.. తాజాగా విజయనగరం జిల్లా పోలీసు శాఖ, మొబైల్స్ చోరీ చేస్తే సులువుగా గుర్తించేందుకు ప్రత్యేక వెబ్ పోర్టల్ తీసుకొచ్చింది. ఎవరిదైనా మొబైల్ పోతే vzmmobiletracker. in పోర్టల్ లోకి వెళ్లి సంబంధిత వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ ఫిర్యాదు నేరుగా సైబర్ సెల్ కు వెళ్తుంది. పోలీస్ స్టేషన్లకు వెళ్లే అవసరం ఉండదు.
Advertisement
వివరాలు ఇచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు స్టేటస్ తెలుసుకునేందుకు అవకాశం ఉంది. ప్రతి మొబైల్ కు ప్రతి మొబైల్ లకు IMEI నంబర్ ఉంటుంది. ఆ 15 అంకెల ఈ నెంబర్ ను పోయిన తేదీ, సమయం, కంపెనీ వివరాలు తెలుసుకుంటారు. చాలామంది మొబైల్స్ పోయినా చాలామంది పర్వాలేదని పట్టించుకోవడం లేదట, ఈ కేసుల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు మొదలు పెట్టామన్నారు విజయనగరం ఎస్పీ దీపిక పాటిల్. అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. హైదరాబాద్, తమిళనాడు, కేరళ, ఒడిశా, చత్తీస్గడ్ తదితర రాష్ట్రాలు దాటి వెళ్లిన మొబైల్స్ ను సైతం కనిపెట్టామన్నారు.
Advertisement
గత ఆరు నెలల్లో రూ.50 లక్షల విలువైన 300 పరికరాలను బాధితులకు అందించామన్నారు. మొబైల్ పోతే సైబర్ సెల్ కు పంపించి వారి ద్వారా దర్యాప్తు చేయిస్తారు. సమయం లేకపోతే 8977945606 నంబర్ ను వాట్సప్ లో సంప్రదించవచ్చు. నాలుగు నెలల కిందట 55 మొబైల్స్, రెండు నెలల క్రితం రూ.8 లక్షలు విలువైన వాటిని, ఇటీవల రూ.16 లక్షల విలువైన 103 మొబైల్ లను బాధితులకు పోలీసులు అందించారు. విశాఖలోని దువ్వాడలో ఉన్న విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ కాలేజ్ సహకారంతో దీన్ని రూపొందించారట. విజెడ్ఎమ్ మొబైల్ ట్రాకర్ డాట్ ఇన్ వెబ్ పోర్టల్ ద్వారా మొబైల్ పోగొట్టుకున్న బాధితులకు సాయం అందిస్తున్నారు. వెబ్ పోర్టల్ ను ఓపెన్ చేశాక రిపోర్టు కంప్లైంట్ ఆప్షన్ క్లిక్ చేస్తే, లోపల రిపోర్టు కంప్లైంట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో పేరు, కాంటాక్ట్ నంబర్, ఐఎంఈఐ నంబర్లు, జిల్లా, ఊరు, ఎక్కడ పోగొట్టుకున్నది, ఫోన్ మోడల్ వివరాలు నమోదు చేయాలి. కొద్ది రోజుల తర్వాత ఫిర్యాదు స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు. రికవరీ అయిన తర్వాత బాధితులు ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కు సమాచారం వస్తుంది.
READ ALSO : సమంత మళ్ళీ ప్రేమలో పడిందా?