Advertisement
Waltair Veerayya Movie story: యువ దర్శకుడు బాబి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ” వాల్తేరు వీరయ్య”. చిరంజీవికి ఇది 154 వ సినిమా. ఈ ఏడాది ముందుగా వచ్చిన ఆచార్య బాక్సాఫీస్ వద్ద డీలాపడినప్పటికీ.. గాడ్ ఫాదర్ సినిమా ఆ గాయాన్ని చెరిపేసింది. ఇక ప్రస్తుతం వాల్తేరు వీరయ్య గా వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించింది మూవీ యూనిట్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి దీపావళి సందర్భంగా టైటిల్ టీజర్ ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ టైటిల్ టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Advertisement
Advertisement
తాజాగా ఈ సినిమా నుంచి ” బాస్ పార్టీ” ఊర మాస్ సాంగ్ లిరికల్ వీడియోని విడుదల చేసింది చిత్రం బృందం. ఈ సాంగ్ లో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌటేలా చిరుతో కలిసి స్టెప్పులేసింది. ఇక ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతిహాసన్ నటిస్తోండగా.. మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు అన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అయితే ఈ సినిమా కథ ఇదే అంటూ ఓ స్టోరీ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఈ సినిమా కథ ఏంటంటే.. ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉంటారు. ఒక భర్యకి పుట్టిన కొడుకు వాల్తేరు వీరయ్య కాగా.. మరో భార్యకి పుట్టిన కొడుకు రవితేజ. వాల్తేరు వీరయ్య ఆంధ్రలో కార్మిక సంఘానికి నాయకుడిగా ఉంటాడు.
ఇక రవితేజ పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఒకానొక సమయంలో వీరిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. మధ్యలో విలన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి.. వాటిని వీరయ్య, రవితేజ ఎలా ఎదుర్కొన్నారు? అనే అంశం చుట్టూ సినిమా తిరుగుతోంది. ఈ చిత్రంలో చిరంజీవి, రవితేజ కి తండ్రి పాత్రలో సత్యరాజ్ నటిస్తున్నారు. ఇక విలన్ పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. ఒకవేళ ఈ స్టోరీ నిజం అయితే సినిమా హిట్ అవుతుందని అంటున్నారు సినీ ప్రముఖులు. ఇంతకీ ఈ కథ నిజమేనా?.. కాదా? అని తెలియాలంటే సినిమా విడుదల అయ్యేదాకా వేచి చూడాలి.