Advertisement
Weekly Horoscope : వృత్తి వ్యాపారాలు చేసే వృషభ రాశి వారికి ఆర్థికంగా ఇది ఎంతో అనుకూల సమయం. మీన రాశి వారు ఉద్యోగం మారే విషయంలో మోసపోయే అవకాశం ఉంది. వీటి వివరాలతో పాటు అన్ని రాశుల వారిగా వార ఫలాలు ఎలా ఉన్నాయంటే!
Advertisement
ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. అవసరానికి డబ్బు అందుతుంది. రోజువారి వ్యాపారంలో నిరాటకంగా కొనసాగుతుంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అధికారుల ఆదరణ పెరుగుతుంది. శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. గృహ నిర్మాణం చేపడతారు.
వృషభం
పలుకుబడి పెరుగుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులకు అనువైన సమయం కాదు. ఉద్యోగ ప్రయత్నాలలో జాప్యం జరగవచ్చు. సహోద్యోయోగులతో అభిప్రాయ బేధాలు తలెత్తవచ్చు. అధికారుల అండతో సమస్యలను అధిగమిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం.
మిథునం
మంచి ఉద్యోగంలో చేరతారు. పనులు నిర్ణిత సమయంలో పూర్తవుతాయి. కుటుంబ పెద్దల సహాయం లభిస్తుంది. వ్యాపారం సంతృప్తికరంగా సాగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఓపికతో పనులు పూర్తి చేస్తారు. నూతన వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సహకారం పొందుతారు.
కర్కాటకం
ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల సహకారం లభిస్తుంది. స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. బాకీల వసూలులో జాప్యం జరుగుతుంది. కోర్టు కేసులలో అనుకూల తీర్పులు వెలువడుతాయి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది.
సింహం
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలు ఉన్నాయి. పట్టుదలతో పనులు చేస్తారు. రాజకీయ ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం పై శ్రద్ధ నిలుపుతారు.
కన్య
రాజకీయ పనులు కలసి వస్తాయి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. భూ లావాదేవీలు కలిసి వస్తాయి. శ్రమ పెరుగుతుంది.
Advertisement
తుల
శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కళాకారులకు ఆదరణ లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. చేపట్టిన పనులు పూర్తి చేయడానికి ఆర్థిక వనరులు సమకూరుతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. రోజువారి వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది.
వృశ్చికం
బరువు, బాధ్యతలు పెరుగుతాయి. పనులు పూర్తి కావడంలో కొంత జాప్యం జరగవచ్చు. పెద్దల సహకారం లభిస్తుంది. కొత్త అవకాశాలతో ఆదాయాన్ని పెంచుకుంటారు. ప్రారంభించిన పనులలో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. పట్టుదల, ఏకాగ్రత అవసరం. ఆస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది.
ధనుస్సు
రచయితలకు మంచి అవకాశం. ఆదాయం పెరుగుతుంది. పెద్దల సూచనలను పాటించి సత్ఫలితాలను పొందుతారు. డబ్బు చేతికి అందుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. రోజువారి కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది.
మకరం
అధికారుల ఆదరణ లభిస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. ఉత్సాహంగా ఉంటూ సంతృప్తిగా పనులు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి అవకాశం. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరుగుతాయి.
కుంభం
వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అందరితో చర్చించి సమయానుకూల నిర్ణయాలను తీసుకుంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు.
మీనం
వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆఫీసులో అందరితోనూ సత్సంబంధాలు ఉంటాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కళాకారులకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది.
read also : గెటప్ శ్రీనుకు షాకింగ్ రెమ్యునరేషన్..”గాడ్ ఫాదర్” సినిమాకు అంత తీసుకున్నాడా?