Advertisement
Weekly Horoscope in Telugu 2023: ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ఈ వారం రాశి ఫలాలు చూసుకుంటున్నారు. అయితే, ఈ జ్యోతిష్యం ప్రకారం వ్యక్తులకు ప్రతి రోజూ ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేయవచ్చు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు భవిష్యత్తును అంచనా వేయగలరు. ఇలా మేషం మీనం వరకు.. 05-02-2023 నుంచి 11-02-2023 ఎవరెవరికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఇప్పుడు చూద్దాం.
Advertisement
మేషం
తలపెట్టిన కార్యాలు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. స్నేహితులు ఆత్మీయులతో చేసే పనులు కలిసి వస్తాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. రావాల్సిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. ఉద్యోగంలో సంతృప్తిగా ఉంటారు.
వృషభం
ఆహార నియమాలను పాటించడం అవసరం. ప్రయాణాల వల్ల ఖర్చులు అధికమవుతాయి. వ్యాపారులకు కాలం కలిసి వస్తుంది. ఉద్యోగులు అధికారుల ప్రశంసలు అందుకుంటారు. సహోద్యోగులతో సఖ్యత అవసరం. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మీకు పనులలో అదృష్టం కలిసి వస్తుంది. సమయానుకుల నిర్ణయాలు తీసుకుంటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పాత బాకీలు కొంతవరకు వసూలు అవుతాయి. నూతన ఉద్యోగంలో చేరవచ్చు. ఉద్యోగులకు పదోన్నతి స్థానచలణ సూచన.
కర్కాటకం
ఉద్యోగం సంతృప్తికరంగా సాగుతుంది. ఆర్థిక విషయాల్లో తాత్కాలిక ఊరట లభిస్తుంది. సహోద్యోగులతో సఖ్యతతో మెలుగుతారు. అధికారులతో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు. వ్యాపారం సజావుగా సాగుతుంది. సోదరులు, స్నేహితులతో కొన్ని పనులు నెరవేరుతాయి.
సింహం
తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పారిశ్రామికవేత్తలకు, వ్యవసాయదారులకు అనుకూలం.
కన్య
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. రోజువారి వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి తాత్కాలిక ఊరట లభిస్తుంది. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. విద్యార్థులకు మంచి సమయం. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది.
తుల
Advertisement
ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. రావాల్సిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. రాజకీయ, ప్రభుత్వ పనులలో వృధా ఖర్చులు ఉంటాయి.
వృశ్చికం
ఆర్టిక ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరుగుతాయి. పట్టుదల ఏకాగ్రతతో ముందుకు వెళ్లడం ఈ వారం అవసరం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు చదువులో రాణిస్తారు పై చదువులకు ఈ వారం అనుకూలం.
ధనస్సు
ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. సోదరులు ఆత్మీయులు సహకారంతో సమస్యలను అధిగమిస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సమయాన్ని వృధా చేయకుండా పనులపై మనసు నిలుపుతారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు పనులలో జాప్యం జరగవచ్చు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. పట్టుదల, విశ్వాసంతో పనులు చేస్తారు. ఆర్థికంగా సర్దుబాట్లు అవసరం రావచ్చు. పలుకుబడి పెరుగుతుంది. సహోద్యోగులు సహకారం లభిస్తుంది.
మకరం
ప్రారంభించిన పనులు సమయానికి పూర్తవుతాయి. వ్యాపార లావాదేవీలు కలిసి వస్తాయి. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. గృహ నిర్మాణం దిశగా ప్రయత్నాలు సాగిస్తారు. పరిచయాల ద్వారా కార్య సాఫల్యం ఉంది.
కుంభ
శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. అధికారులు ఆదరణ కోసం ప్రయత్నిస్తారు. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఈ వారం అవసరం. ఉత్సాహంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండటం అవసరం.
మీనం
కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపుతడతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తారు. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. ఇంటా బయట ప్రోత్సాహకర వాతావరణము ఉంటుంది.
READ ALSO : వెరైటీ స్టోరీ ! 30 ఏళ్ల యువతితో 18 ఏళ్ల యువకుడి విచిత్ర ప్రేమకథ.. ! అసలు ఎలా కుదిరిందంటే ?