Advertisement
ఆడవాళ్లు జడ వేసుకునేటప్పుడు ఏం చేస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుంది? ఆడవారు జడ వేసుకునేటప్పుడు చేయకూడని తప్పులు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆడవాళ్ళు జడను పూజామందిరంలో గాని, వంటగదిలో కానీ, ఇంటి మధ్యలో నిలబడి గాని జడ వేసుకోకూడదు. అలాగే అటు ఇటు తిరుగుతూ, మాట్లాడుతూ కూడా జడ వేసుకోకూడదు. అలాగే ఏడుస్తూ జడ వేసుకుంటే అష్ట దరిద్రం. ఆడవాళ్ళు పడకగదిలోనే జడ వేసుకోవడం చాలా మంచిది. పడకగదిలో ఆడవాళ్లు జడ వేసుకుంటే మంగళకరమని శాస్త్రాలే చెబుతున్నాయి.
Advertisement
జడ వేసుకునే టప్పుడు వచ్చే చిక్కుని కింద పడకుండా చూసుకోండి. ఆ చిక్కు ఇంటి లోపల పడితే దరిద్రం. అందుకే ఆ చిక్కును బయట చెత్తబుట్టలో పడేయండి. అలాగే చాలామంది ఆడవారు సింహద్వారం బయటికి వెళ్లి జడ వేసుకుంటూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే బ్రహ్మ రంధ్రానికి ఇతరుల దిష్టి తగిలే ప్రమాదం ఉంటుంది. దాని వల్ల అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి సింహద్వారం బయటకు వెళ్లి జడ వేసుకోకూడదు. చాలా మంది మహిళలు ఒకరికొకరు జడ వేసుకుంటూ ఉంటారు.
Advertisement
అలా వేసుకోవడం తప్పేమీ కాదు. కానీ ఒకరి చిక్కును మరొకరు తీయకూడదు. ఎవరి జడ చిక్కును వాళ్లే తీసుకోవాలి. ఈ నియమాలు గనుక పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. జడ వేసుకునేటప్పుడు వచ్చిన చిక్కును ఒడిలో పెట్టుకుంటే సంతాన ప్రాప్తి కలగడం ఆలస్యమవుతుంది. అలాగే అరచేతిలో కూడా జడ చిక్కును పెట్టుకోకూడదు. ఇలా చేస్తే ధనం,దాంపత్య సుఖం, ఆయుష్షు తగ్గిపోతుంది. అలాగే దువ్వుకునేటప్పుడు వచ్చిన చిక్కును దువ్వెనలో ఉంచకూడదు.
also read;
అనౌన్స్ చేసి రిలీజ్ కానీ… మహేష్ బాబు సినిమాలు ఇవే !