Advertisement
ఇటీవల అన్ని భాషల దర్శకులు తమ సత్తా చాటుకోవడానికి సినిమాను ఇతర భాషలలో కూడా విడుదల చేస్తున్నారు. దీనితో సినిమా అనేది ఇప్పుడు యూనివర్సల్ అయిపొయింది. ఒక సినిమాను అన్ని ప్రాంతాల వారు, భాషల వారు ఆసక్తిగా చూస్తున్నారు. ప్రస్తుతం తమిళ్, బాలీవుడ్ నుంచి వచ్చిన జవాన్, జైలర్, విక్రమ్ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచి ఉన్నాయి. అయితే.. ఈ మూడు సినిమాలలో కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటో ఈ ఆర్టికల్ లో చూసేద్దాం.
Advertisement
ఈ మూడు సినిమాలను తమిళ కుర్ర డైరెక్టర్లే డైరెక్ట్ చేసారు. జైలర్ సినిమాను తమిళ దర్శకుడు నెల్సన్ డైరెక్ట్ చేయగా, విక్రమ్ కు లోకేష్ కనగరాజ్, జవాన్ కు అట్లీ దర్శకత్వం వచించారు. సూపర్ స్టార్ రజిని జైలర్ లో నటించగా, విక్రమ్ లో కమల్ హాసన్, జవాన్ లో షారుఖ్ ఖాన్ నటించారు. ఈ మూడు సినిమాలు భారీ అంచనాలతోనే విడుదల అయ్యాయి. ప్రస్తుతం వీటి కలెక్షన్స్ కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ మూడు సినిమాల్లో ఉన్న మరో కామన్ పాయింట్ ఏంటి అంటే.. ఈ మూడు సినిమాల్లోనూ హీరోలు సీనియర్లే.
Advertisement
ఈ మూడు సినిమాల్లోనూ హీరోలు టైటిల్ రోల్ నే పోషించారు. అంతే కాదు.. వారు గతంలో తమతో నటించిన వారి సహాయం తీసుకుని సమస్యలను పరిష్కరిస్తారు. అలాగే.. ఈ మూడు సినిమాల్లోనూ తండ్రి కొడుకుల కనెక్షన్ ను అద్భుతంగా చూపించారు. అలానే.. ఈ మూడు సినిమాలకు సంగీతాన్ని యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవి చందర్ అందించారు. మరో కామన్ పాయింట్ ఏంటి అంటే.. ఈ మూడు సినిమాల్లోని హీరోలు గతంలో రక్షణ విభాగంలో పని చేసినవారే.
మరిన్ని..