Advertisement
వివాహం అత్యంత పవిత్రమైన సంబంధాలలో ఒకటి. వివాహం ద్వారా ఒక్కటైన జంట ఎన్నో కలలతో తమ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ప్రేమ, నిబద్ధత మరియు నమ్మకంతో కూడిన ఈ బంధం సజావుగా సాగాలంటే కొన్ని సర్దుబాట్లు తప్పనిసరి. అయితే ప్రేమించి చేసుకున్న పెళ్లిళ్లలో కూడా ఈ సర్దుబాట్లు తప్పవు. ప్రస్తుత రోజుల్లో అరేంజ్డ్ మ్యారేజెస్ అయినా.. లవ్ మ్యారేజెస్ అయినా.. ఎక్కువ కాలం నిలవడం లేదు. చిన్న చిన్న కారణాలకు జంటలు గొడవలు పెట్టుకుని విడిపోతున్నారు.
Advertisement
పాశ్చాత్య దేశాల్లోనే కాకుండా భారతదేశంలో కూడా విడాకుల కేసుల ట్రెండ్ పెరుగుతోంది. చాలా వివాహాలు విడాకులతో ముగియడానికి కారణాలు చాలా ఎక్కువ. పెళ్లితో వారు బాధపడుతున్నారు అనడం ఒక్కటే కారణం కాదు. విడాకుల వెనుక అనేక కనిపించని కారణాలు ఉంటాయి. నిజానికి ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలంటే ప్రేమ ఒక్కటే సరిపోదు. ప్రేమ లేనంత మాత్రాన వారిద్దరూ విడిపోవాలని కాదు. ప్రేమ ఉంటె ఆ బంధం బాగుంటుంది. ప్రేమ ఉన్నా లేకున్నా వివాహ సమయంలో ఇద్దరు వ్యక్తులు తీసుకున్న బాసలకు నిలబడి ఉండాలి. అప్పుడే వారిద్దరి మధ్య బంధం గట్టిపడి ప్రేమ చిగురిస్తుంది. అసలు ఏ జంటా అంత ఓపిక పట్టడం లేదు.
Advertisement
ఈ కారణంగా విడాకుల కేసులు కూడా పెరుగుతున్నాయి. దీపికా నారాయణ్ భరద్వాజ్ అనే జర్నలిస్ట్ ఇలాంటి కారణాల గురించి మాట్లాడటానికి ట్విట్టర్ (ప్రస్తుతం X)లో ఒక పోస్ట్ చేసారు. భారతదేశంలో వివాహాలు పెటాకులు కావడానికి గల కారణాలేమిటని ఆమె ప్రశ్నించింది. దీనికి పలువురు నెటిజన్స్ రకరకాల సమాధానాలు తెలిపారు. వాటిని మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ ప్రశ్న వేసిన తర్వాత ఆమె తన వ్యక్తిగత సమాధానాన్ని కూడా ఇచ్చింది. “వివాహం చేసుకున్నాక ప్రతి జంటా పెళ్లి సమయంలో తాము చేసుకున్న బాసలను మర్చిపోతారని.. అందువల్లే వివాహాలు విడాకుల దాకా వెళ్తున్నాయని అన్నారు. ఈ పోస్ట్ కి పలువురు రకరకాలుగా కామెంట్స్ చేసారు. కొందరు కాంప్రమైజ్ అయ్యే నేచర్ లేకపోవడం వల్ల అని కామెంట్ చేస్తే.. మరి కొందరు ప్రస్తుత సెలెబ్రిటీలు ఈ విడాకుల ట్రెండ్ కామన్ విషయంగా మార్చేశారని అంటున్నారు.
The biggest reason according to me for breakdown of marriages in India is the couple forgetting the vows they took during marriage.
Everyone is besotted with how the wedding function should look like but not how their marriage should look like and what they need to do for it
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) July 31, 2023
మరిన్ని..
స్కంద సినిమాలో రచ్చ లేపే ఆ పొలిటికల్ డైలాగ్స్ ని తీసేయడానికి అసలు కారణం ఏంటి?
చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్.. మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు..!
కేసీఆర్ ను ఓడించిన ఈ ఒకే ఒక్క వ్యక్తి గురించి తెలుసా? ఇతను ఎవరంటే?