Advertisement
ఐపీఎల్ 2024 కోసం క్రికెట్ అభిమానులు అప్పుడే ఎదురు చూడడం మొదలు పెట్టేసారు. అయితే.. ఈ సీజన్ కి ఇంకా టైం ఉంది. అయితే.. ఇందుకు సంబంధించిన వార్తలు మాత్రం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గుజరాత్ జట్టు నుంచి క్యాష్ ట్రేడింగ్ పద్ధతి ద్వారా ముంబై ఇండియన్స్ టీం కి మారాడు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఈ వార్తా వైరల్ అవుతోంది. హార్దిక్ పాండ్యా టీం మారడానికి కారణం ఏంటి? అన్న చర్చలు జరుగుతున్నాయి.
Advertisement
రెండు ఐపీఎల్ సీజన్లలోనూ గుజరాత్ జట్టులో ఇరగదీసాడు హార్దిక్ పాండ్యా. అయితే.. ఇప్పుడు ఉన్నట్లుండి జట్టు ఎందుకు మారినట్లు? అంటూ క్రికెట్ అభిమానులు చర్చలు జరుపుతున్నారు. గుజరాత్ యాజమాన్యంతో హార్దిక్ కు గొడవలేమైనా అయ్యాయా? టీం చేంజ్ పై స్పందించినప్పటికీ టైటాన్స్ గురించి ఎందుకు మాట్లాడలేదు? అంటూ క్రికెట్ అభిమానుల్లో సందేహాలు వస్తున్నాయి. “నా సొంత టీం ముంబై ఇండియన్స్ కు చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, ముంబై జట్టుతో నాకు అవినాభావ సంబంధం ఉందని, ముంబై, వాంఖడే, పల్టాన్ లాంటి మధురానుభూతులు చాలానే ఉన్నాయి..” అంటూ హార్దిక్ ట్వీట్ చేసాడు.
Advertisement
అయితే రెండు ఐపీఎల్ సీజన్లలో కెప్టెన్ గా వ్యవహరించిన టైటాన్స్ జట్టు గురించి పేరైన ఎట్టకపోవడంతో అభిమానులకు అనుమానాలు వస్తున్నాయి. అద్భుతంగ రాణించే గుజరాత్ టీం ను హార్దిక్ ఎందుకు వదిలేస్తాడు? యాజమాన్యంతో ఏమైనా గొడవలు ఉన్నాయా? అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హార్దిక్ కు తన సొంత ఫ్రాంచైజీకి వెళ్లాలని మాతో చెప్పాడని, అందుకే అతని నిర్ణయాన్ని గౌరవించామని, గుజరాత్ టైటాన్స్ టీమ్ డైరెక్టర్ పేర్కొన్నారు. కానీ హార్దిక్ జట్టు మారడానికి అసలు కారణం ఏంటో ఎవరికీ తెలియరాలేదు.
Read More:
Animal Movie: యానిమల్ సినిమాపై వైరల్ అవుతున్న మీమ్స్.. చూస్తే నవ్వాపుకోలేరు!
మరీ ఇంత బలుపులేంట్రా ? ఈ ఆస్ట్రేలియా వాళ్ళకి కప్ గెలిచిన ఆనందం లో ఇండియా ని ఇలా అవమానించారా ?