Advertisement
Relationship : భార్యాభర్తల బంధం జీవితంలో అత్యుత్తమ బంధంగా పరిగణించబడుతుంది. ఈ సంబంధంలో, ఇద్దరు వ్యక్తులు తమ జీవితమంతా ప్రేమ మరియు పరస్పర అవగాహనతో సంతోషంగా గడుపుతారు. కానీ మారుతున్న కాలంతో పాటు సంబంధానికి విలువ లేకుండా పోయింది. భార్యాభర్తల మధ్య కొన్ని దాపరికాలు అనేవి వారి సంసార జీవితాన్ని నాశనం చేస్తుంది. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తలు ఒకరికొకరు పంచుకోకుండా ఉండవలసిన విషయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
#1. ఎదుటి వారిపై ఆకర్షణ :
మీ భర్త లేక భార్య మీద అధిక ప్రేమ ఉన్నప్పుడు పలానా వ్యక్తి వస్త్రధారణ బాగుందని, వారు చాలా అందంగా ఉన్నారని మీరు ఆమె లేక అతడు గురించి పొగిడితే వారి ఈగో హర్ట్ అయ్యి తప్పుడు ఆలోచనలకు దారితీస్తాయి. తద్వారా భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా గొడవలకు దారి తీసే ఆస్కారం ఎక్కువగా ఉంది. అందువలన మీకు ఎవరి పైన అయినా ఒక మంచి అభిప్రాయం ఉన్నప్పుడు మీ జీవిత భాగస్వామితో ఆ విషయం అసలు పంచుకోకూడదు అని నిపుణులు చెబుతున్నారు.
#2. మీ విషయాలను ఇతరులతో షేర్ చేసుకోవడం :
Advertisement
మీకు ఎదుటివారిపై మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ మీ విషయాలు ఎవరితోనైనా షేర్ చేసుకునేటప్పుడు వారు నెగిటివ్ యాటిట్యూడ్ కలవారు అయితే మీ దాంపత్య జీవితంలో వారి వలన గొడవలు వచ్చే ప్రమాదం ఉంది. అందువలన మీ అభిప్రాయాలు ఎప్పుడు మీ భర్త లేక మీ భార్య సన్నిహితుల వద్ద అసలు చెప్పుకోవద్దు.
#3. తల్లిదండ్రులకు చెప్పటం :
మీ భార్యాభర్తల మధ్య జరిగే ఎటువంటి చిన్న విషయాన్ని అయినా తల్లిదండ్రులకు అస్సలు చెప్పకూడదు. దానివలన మీ మధ్య గొడవలు పెరిగి పెద్దవయ్యే అవకాశం ఇంకా ఎక్కువవుతుంది. అందువలన మీ ఇద్దరి మధ్య జరిగే సంభాషణలు మీకు సంబంధించినవి ఉండాలి తప్ప.. బయట వ్యక్తుల విషయాల జోలికి అసలు పోకూడదు. కేవలం మీకు జరిగిన మంచి అనుభవాలనే మీరిద్దరూ షేర్ చేసుకోవాలి తప్ప.. మూడో వ్యక్తి విషయాలు భార్యాభర్తల మధ్యలోకి రావడం వలన దాంపత్య జీవితం ప్రమాదంలో పడితే అవకాశం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
Also Read :
భర్త… భార్యకు ఏ విధంగా ఉంటే నచ్చుతుందో తెలుసా, ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి
మీ అత్తగారి మనసును గెలవాలి అంటే ఈ ఐదు విషయాలను తప్పకుండా పాటించండి..!