Advertisement
చాలా మందికి జైలులో విఐపి సౌకర్యాలు ఉంటాయా? అన్న సందేహం ఉంటుంది. అయితే.. జైళ్ల శాఖకు సంబంధించి విఐపి సౌకర్యాలు అంటూ ఏమీ ఉండవు. కానీ.. ప్రత్యేక ఖైదీ పేరిట కొన్ని సౌకర్యాలను మాత్రం అందిస్తూ ఉంటారు. జైలు శిక్ష అనేది సాధారణంగా స్వేచ్ఛ మరియు సాధారణ విలాసాలు లేని జీవితాన్ని సూచిస్తుంది మరియు జైలు నిబంధనలకు అనుగుణంగా సవాలుగా ఉండటమే కాకుండా ఖైదీ జీవితం నిరంతరం నిఘాలో ఉండేలా చూస్తుంది. కానీ ప్రత్యేక ఖైదీ హోదా పొందిన ఖైదీలకు మాత్రం ఇది కొంచం సులభతరంగా ఉండవచ్చు. కానీ ఈ ప్రత్యేక ఖైదీ హోదాని అందరికి ఇవ్వరు.
Advertisement
ఇది జైళ్ల శాఖ పరిధిలోకి రాదు. ఇది న్యాయస్థానం పరిధిలోకి వస్తుంది. న్యాయస్థానం ఇచ్చిన అనుమతి తోనే జైళ్ల శాఖ కొందరు ఖైదీలను స్పెషల్ ఖైదీలుగా ట్రీట్ చేస్తూ ఉంటారు. వీరికి ప్రత్యేక గదిని ఇస్తారు. దానినే స్పెషల్ బ్యారక్ అంటారు. ఇందులో ఖైదీల కోసం ప్రత్యేకంగా ఫ్యాన్, ఏసీ, టివి, ఫ్రిడ్జ్ ఇస్తారు. ఇంటి నుంచి సరుకులు తెప్పించుకుని వండించే ఏర్పాటు చేస్తారు. అందుకోసం ప్రత్యేకంగా వంట మనిషిని కూడా ఏర్పాటు చేస్తారు.
Advertisement
కావాలంటే ఇంటి నుంచి భోజనం తెప్పించుకునే అనుమతి కూడా ఇస్తారు. అయితే.. ఈ ప్రత్యేక సదుపాయాల కోసం రెంట్ కూడా పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇది భారీ మొత్తంలోనే ఉంటుంది. కానీ, ఈ ఫెసిలిటీస్ ని అందరికి ఇవ్వరు. వ్యక్తులను బట్టి, పరిస్థితులను బట్టి, కేసు తీవ్రతని బట్టి న్యాయస్థానం నిర్ణయిస్తుంది. ఇది కొన్ని సార్లు న్యాయస్థానమే అనుమతి ఇస్తుంది. లేదా ఖైదీలు న్యాయస్థానానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అనుమతి పొందిన తరువాత నుంచే వారిని ప్రత్యేక ఖైదీగా గుర్తించి, ప్రత్యేక బ్యారక్ కు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
మరిన్ని..