Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక గదిని కేటాయించారు. ఆయన గత 32 రోజులుగా జైలు లోనే ఉంటున్నారు. ఆయనకు ఇంట్లో వండిన ఆహారం మరియు మందులు పొందడానికి అనుమతి ఇవ్వబడింది. ఎక్కువ రోజులపాటు చంద్రబాబు నాయుడు జైల్లో ఉండాల్సి రావడంతో ఆయనకీ ఇంటి నుంచి భోజనం, మందులు వంటివి పంపించడానికి కోర్టు అనుమతి మంజూరు చేసింది. అయితే.. ఆయనకు ప్రాణహాని ఉందన్న విషయంలో ఆయనకు ప్రత్యేక వసతి సౌకర్యాలతో పాటు.. జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని కూడా అందించారు.
Advertisement
వీటిని కూడా చదవండి: నటి ప్రత్యూష చనిపోతే.. సినీ సెలెబ్రిటీలు ఎందుకు మాట్లాడలేదు? ఆ రాజకీయ నాయకుడే కారణమా?
Advertisement
ఎపి స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి నేటికీ 32 రోజులు కావొస్తోంది. ఆయన జైలు జీవితం ఎలా ఉంటోందో.. ఆయన వయసు, ఆరోగ్యం దృష్ట్యా.. ఆయనకు ఎలాంటి ఆహరం పెడుతున్నారో అన్న సందేహాలు చంద్రబాబు నాయుడి అభిమానుల్లో కలుగుతున్నాయి. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటి నుంచి ఆహరం పంపించడానికి కోర్టు అనుమతి ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
వీటిని కూడా చదవండి: అతిలోక సుందరి తన డైట్ లో చేసిన ఆ ఒక్క తప్పే తన ప్రాణాన్ని బలి తీసుకుందా ?
ఆయనను అరెస్ట్ చేసిన వెంటనే స్నేహ బ్లాక్ లో ఉంచారు. ఈ బ్లాక్ లో ఆయనకు ప్రత్యేక గదిని కేటాయించారు. చుట్టూ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇక ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన కుటుంబ సభ్యులు ఆయన కోసం ఫ్రూట్ సలాడ్, తాగడానికి వేడి నీరు, బ్లాక్ కాఫీ ని పంపించారు. కుటుంబ సభ్యులు పంపిన ఆహారాన్నే జైలు సిబ్బంది చంద్రబాబు నాయుడుకు అందించారు.
మరిన్ని..
వీటిని కూడా చదవండి: శ్రీలీల నందమూరి ఇంటి కోడలు కాబోతోందా? వైరల్ అవుతున్న ఫోటో..!