Advertisement
Hero suman : ఇప్పటి వారికి సుమన్ ఓ సీనియర్ యాక్టర్ గానే తెలుసు.. కానీ ఒకప్పటిలో ఆయన పెద్దపెద్ద హీరోలకే హీరోగా గట్టి పోటీని ఇచ్చారనే విషయం చాలామందికి తెలియదు. కరాటే లో బ్లాక్ బెల్ట్ సాధించిన సుమన్ ఆయన యాక్టింగ్ మరియు గ్లామర్ తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఆయన సినిమా విడుదలవుతుందంటే చాలు దియేటర్లకు క్యూ కట్టేసేవారు. ఇక సుమన్ డేట్స్ కోసం దర్శకనిర్మాతలు సైతం పడిగాపులు పడేవారు. ఇక ఆయన కెరియర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలో ఒక ఘటన ఆయన జీవితాన్నే మార్చేసింది.
Advertisement
ఓ అర్ధరాత్రి సమయంలో పోలీసులు వచ్చి సుమన్ ని అరెస్టు చేయడంతో.. ఆయనపై ఎన్నో విమర్శలు వెల్లవలా వచ్చి పడ్డాయి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో..? అసలు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితిలో సుమన్ ని అరెస్టు చేశారు. ఆ కేసు నుండి బయటపడటానికి సుమన్ కు చాలా సంవత్సరాలు పట్టింది. ఎంతోమంది ఆయనపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ కేసు వల్ల సుమన్ దాదాపు చాలా రోజులు పాటు జైలు జీవితాన్ని గడిపారు.
సుమన్ ఓ ప్రముఖ పత్రిక ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. 1985 మే 18వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట ముప్పై నిమిషాలు అవుతుంది. ఇంతలో బయట కుక్కలు బాగా మొరుగుతూ ఉన్నాయి. మా వాచ్మెన్ వచ్చి మీకోసం చాలామంది పోలీసులు మీ కోసం వచ్చారు అని చెప్పాడు. ఇంతకీ ఏంటి విషయం అని పోలీసులను అడగగా.. మీ ఇంటిలో ఎవరో బాంబు పెట్టారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ ఇల్లును సోదా చేయాలి అని వారు చెప్పుకొచ్చారు. సోదాలు చేసిన తర్వాత కొద్దిసేపటికి మీ ఇంట్లో ఏమీ దొరకలేదని చెప్పారు. కానీ మీరు మాతో పాటు పోలీస్ స్టేషన్కు రావాలని నన్ను తీసుకువెళ్లారు. స్టేషన్ కి వెళ్ళిన తర్వాత అమ్మాయిలను వేధించినట్టు, అశ్లీల చిత్రాలను తీస్తున్నట్లు ఆరోపించి కేసులు వేశారని చెప్పారు. ఇక తరవాత రోజు నన్ను కోర్టులో హాజరు పరిచారు. బ్లూ ఫిలిమ్స్ ఎక్కడ ఉన్నాయని అడగ్గా.. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉందని సమాధానం ఇచ్చారు. వారు చెప్పిన డేటు టైము ప్రకారం సాక్షాలు పర్ఫెక్ట్ గా ఉన్నాయా అంటే అది కూడా లేదు. ఆ టైంలో నేను బెంగళూరులో షూటింగ్లో ఉన్నాను. నేను నేరం చేశాను అనడానికి ఎలాంటి ఆధారం లేవు. ఇక నా పై యాంటి గుండా యాక్ట్ లో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం వల్ల ఆయనకు బెయిల్ కూడా దొరకలేదని సుమన్ చెప్పుకొచ్చారు .
Advertisement
ఇక సైదాబాద్ కోర్టులో నుంచి ఆ తర్వాత మద్రాస్ జైలుకి తరలిచి.. సాధారణ ఖైదులు ఉండే గదులలో కాకుండా అత్యంత ప్రమాదకర టె###లు, మానసిక ఉన్మాదులు ఉండే గదుల్లో వేశారన్నారు. ఏం జరుగుతుందో.. ఎందుకు జరుగుతుందో.. అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయాను. నాలుగు గోడల మధ్య చీకటి గదిలో తనకు తానే ధైర్యం చెప్పుకున్నానని చెప్పుకొచ్చారు సుమన్ . ఓసారి తమిళనాడు ముఖ్యమంత్రి అయిన కరుణానిధి గారు ఓ కేసు విషయంలో ఖైదీగా జైలుకు రావడం జరిగింది. అక్కడ ఆయన వచ్చి నా పరిస్థితిని చూసి చెల్లించిపోయారు. ఆయన పైన ఉన్న కేసు ఏంటి..? మీరు చేస్తున్న ట్రీట్మెంట్ ఏంటి అని జైలు అధికారులను హెచ్చరించి తనను వేరే గదికి మార్పించారని సుమన్ చెప్పుకొచ్చారు.
మా అమ్మగారు ఆమె దగ్గర ఉన్న అన్ని ఆధారాలతో న్యాయపోరాటం చేసిందిన్నారు. వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి ఎలాంటి మచ్చలేని నాకు ఇలాంటి పరిస్థితి రావడంతో నేను చాలా కుంగిపోయాను. కానీ న నాకు నేనే ధైర్యం చెప్పుకొని ఓదార్చుకునేవాడిని. ఇక హీరోయిన్స్ సుహాసిని, సుమలత తనకు మద్దతు నిలిచారని, అంతకు మించి ఇండస్ట్రీలో ఎవరూ పట్టిచుకోలేదని సుమన్ చెప్పుకొచ్చారు. అలాగే సుమన్ తల్లి చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతు పెరిగింది. దేశంలోనే ప్రముఖ న్యాయవాదులైన రాంజెఠ్మలానీ, సోలీ సొరాబ్జీ వంటి లాయర్ల గైడెన్స్‌తో తమిళనాడుకు చెందిన రామస్వామి అనే లాయర్.. కోర్టులో గట్టిగా వాదించి సుమన్‌కు బెయిల్ మంజూరయ్యేలా చేశారని సుమన్ ఇంటర్వ్యూ ద్వారా ఆయనకు జరిగిన అన్యాయం గురించి తెలియజేశారు.