Advertisement
చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆయనను అరెస్ట్ చేయడం గురించి చంద్రబాబు నాయుడు గత వారమే చెప్పారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఏపీలో రాజకీయం కొత్త మలుపు తీసుకుంది. మరోవైపు టీడీపీ ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తుంది. రాష్ట్రంలో పరిణామాలను కేంద్ర పార్టీ బిజెపి నిశితంగా గమనిస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రతిస్పందన కూడా కీలకంగా మారింది. జమిలి ఎన్నికల వేళ జరుగుతున్న ఈ మార్పులు ఏపీ రాజకీయాలను ఎటువైపు తిప్పుతాయో అన్న సందేహాలు ప్రజలలో నెలకొని ఉన్నాయి.
Advertisement
అయితే.. ఆయన ప్రస్తుతం స్క్వాష్ పిటీషన్ తో పాటు బెయిల్ కోసం హై కోర్ట్ లో అప్లై చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు పై ఉన్న కేసుల విచారణ జరగనుంది. మరో వైపు అమరావతి భూముల వ్యవహారంపై కూడా సిఐడి విచారణ చేయనుంది. అయితే.. చంద్రబాబు నాయుడు జాతకం గురించి పలు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు 1950 లో ఏప్రిల్ 20 వ తేదీన జన్మించారు. ఆయన పుట్టిన సమయాన్ని అనుసరించి ఆయనది వృషభ రాశి, కృత్తికా నక్షత్రం వస్తుంది. వీరు పట్టువదలని విక్రమార్కుని తరహాలో ఉంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Advertisement
ఆయన జాతకం ప్రకారం ఆయనకు శని మహర్దశ నడుస్తోంది. ప్రస్తుతం అది ఎండింగ్ పీరియడ్ కు వచ్చేసింది. ఈ దశ తరువాత ఆయనకు బుధ మహర్దశ మొదలు కాబోతోంది. ఈ మహర్దశ వస్తే చంద్రబాబు నాయుడుకి అంతా మంచి కాలమే రానుంది. ఆయన త్వరగానే ఈ కేసుల నుంచి బయటపడతారని చెబుతున్నారు. ఈ కేసు నుంచి బయటపడ్డాక ఆయన తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు. బుధుడు అనుకూలిస్తే ఆయనకు ఏకంగా పదేళ్ల పాటు అధికార యోగం కలిగే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మరిన్ని..
Bigboss Season7: పవర్ అస్త్ర దొంగిలించింది ఎవరో తెలుసా ?