Advertisement
మనం కొన్ని కొన్ని సార్లు ఏదైనా సంకేతాలు కనబడితే ఇది దానికి అది దానికి అని చెప్తూ ఉంటాము. పూర్వకాలం నుంచి కూడా పెద్దలు వీటిని చెప్తూ వచ్చారు. కాకులు ఇంటి ముందు అరిస్తే మంచి జరుగుతుంది అని, చుట్టాలు వస్తారని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అయితే కాకుల అరిస్తే ఏమవుతుంది..? కాకులు అరుపులు మంచిది కాదని చాలా మంది అంటారు. అందుకే కాకి అరుపు చెడు శకునంగా భావిస్తారు. కాకులు ఇంటి ముందుకు వచ్చి అరిస్తే జీవితంలో ఏదో చెడు జరుగుతుందని సంకేతంగా భావిస్తారు. అయితే కొన్ని సమయంలో కాకుల అరుపులు మంచిని సూచిస్తుంది. సూర్యోదయం సమయంలో కాకులు అరిస్తే శుభప్రదం గా భావిస్తారు.
Advertisement
జీవితంలో ఆర్థిక పురోభివృద్ధి రాబోతుందని సూచిస్తుంది. త్వరలోనే మీకు సంపద కలిగిస్తుందని ఇది సూచిస్తుంది. అంతేకాకుండా జీవితంలో ఆనందం, శ్రేయస్సు కూడా కలుగుతాయి. కాకులు ఇంటి ఆవరణలో కానీ ఇంటి పైన కానీ అరిస్తే ఇంటికి చుట్టాలు రాబోతున్నారని సంకేతంగా చెబుతారు. అతిథులు రాకను శుభప్రదంగా భావిస్తారు.
Advertisement
Also read:
అతిథి రాక ఇంటికి సంతోషాన్ని, అదృష్టాన్ని తీసుకొస్తుంది. అలాగే కాకి అకస్మాత్తుగా గట్టిగా అరిస్తే బాధకు లేదా సంక్షోభానికి కారణం అవ్వొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలి. ఇది అశుభ ఘటనను సూచిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర లేదా సమీపంలో కాకి పదేపదే అరిస్తే అది సమీప బంధువు మరణానికి సంకేతంగా భావించాలి. శకున శాస్త్రంలో దీనిని ప్రమాదకరంగా భావించారు. కాకులు పదేపదే అరవడం వలన ఇంట్లో గొడవలు వంటివి కూడా వస్తాయట.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!