Advertisement
పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రోజు చావు తప్పదు. అయితే చనిపోయిన తర్వాత కూడా మనిషి మెదడు పనిచేస్తుంది. ఈ విషయం మీరు కూడా వినే ఉంటారు. చనిపోయిన తర్వాత కూడా మనిషి యొక్క మెదడు ఏడు నిమిషాల వరకు పనిచేస్తుంది. అయితే ఆ ఏడు నిమిషాలు ఏం జరుగుతుంది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. చనిపోయిన తర్వాత మనిషి శరీరంలో ఏం జరుగుతుంది అనేది చూస్తే.. మరణాంతరం శరీరంలో అన్ని అవయవాలు పని చేస్తాయని మాత్రం వైద్యులు ఇప్పటికే నిర్ధారించారు. మనిషి చనిపోయిన సుమారు 7 నిమిషాల వరకు మెదడు పనిచేస్తుందట.
Advertisement
Advertisement
ఆ సమయంలో మెదడులో ఏం జరుగుతుంది అనేది చూస్తే.. కొన్ని సైంటిస్టులు చేసిన పరిశోధన ప్రకారం మనిషి చనిపోయిన ఏడు నిమిషాల పాటు మెదడు పనిచేస్తుందని మొదటి నిమిషంలో మనిషి తన పుట్టినరోజును గుర్తు చేసుకుంటాడని, రెండవ అంశంలో సంతోషకరమైన క్షణాలు, స్నేహితులు గుర్తుకు వస్తారని.. మూడవ నిమిషంలో చివరి ప్రేమ గుర్తుకు వస్తుందని చెప్పారు.
Also read:
నాలుగవ నిమిషంలో విచార జ్ఞాపకాలు, ఒంటరి క్షణాలు.. ఐదవ నిమిషంలో అద్భుత క్షణాలు గుర్తొస్తాయట. ఆరవ నిమిషంలో చెడు పనులు గుర్తొస్తాయి. ఏడవ నిమిషంలో ఏం జరుగుతుందో మాత్రం పరిశోధకులు కనుగొనలేకపోయారు. ఇలా వారు తమ పరిశోధనల ద్వారా ఈ విషయాలను వెల్లడించారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!