Advertisement
కుక్కల ఏడుపులు కొంచం భయం కలిగించే విధంగా ఉంటాయి. చాలా మంది కుక్కల ఏడుపుని అపశకునంగా కూడా భావిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మనం ఉండే వీధుల్లోని కుక్కలు గట్టిగా ఏడిస్తే.. దాన్ని అపశకునంగానే భావిస్తూ ఉంటారు. ఒకవేళ.. కుక్కలు మనం ఉండే ఇంటి ముందుకు వచ్చి ఏడిస్తే? అప్పుడు ఏమి జరుగుతుంది అనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. కొంతమంది ఇలా కుక్కలు ఇంటి ముందు వచ్చి ఏడుస్తూ ఉంటె.. వాటిని తరిమి కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
Advertisement
కుక్క అలా అరవడం చెడుకి సంకేతం అని పెద్దవాళ్ళు కూడా చెబుతూ ఉంటారు. నిజానికి, కుక్కలు ఇలా ఎందుకు ఏడుస్తాయో తెలుసా? ఏదైనా ప్రమాదం లేదా విపత్తు సంభవించడానికి ముందే కుక్కలకు సిగ్నల్స్ అందుతాయి. వాటిని పసిగట్టినప్పుడే కుక్కలు అలా ఏడుస్తాయట. అందుకే కుక్కలు ఏడుస్తుంటే.. ఏదైనా విపత్తు రాబోతోంది అని పెద్దవాళ్ళు గట్టిగా నమ్ముతారట.
Advertisement
ఒకవేళ ఏదైనా ఇంటిముందు కుక్క గట్టిగ ఏడుస్తుంటే.. వారి ఇంట్లో ఏదైనా విపత్తు జరగబోతోందని అర్ధం చేసుకోవాలి. ఇంటి బయట లేదా గేటు వద్ద కుక్క గట్టిగ ఏడిస్తే.. ఇది అనారోగ్యాన్ని సూచిస్తుంది. మీ ఇంట్లో ఎవరైనా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పడానికి ఇది సంకేతమట. రాత్రి సమయాల్లో కుక్క ఏడుస్తున్నట్లు శబ్దం చేస్తే.. ఆ ఇంటికి దురదృష్టం రాబోతోందని అర్ధమట. కుక్కల ఏడుపు ఆర్ధిక నష్టాన్ని కలుగ చేస్తుందట. అందుకే.. కుక్కలను ఇంటి బయట ఏడవనివ్వకూడదు. మీ ఇంటి చుట్టూ ప్రతికూల శక్తులు ఉంటె.. వాటిని కుక్కలు పసిగడితే గట్టిగ అరవడం మొదలు పెడతాయట. రాహు కేతువు గ్రహాల కారకుడు కుక్క. అందుకే.. కుక్కలు ఏడిస్తే.. రాహు కేతువుల అశుభాన్ని చూపిస్తున్నట్లు అర్ధమట. కుక్క ఇంటి బయట ఏడుస్తుంటే.. దాన్ని పంపించేయడం మంచిది. ఇలా జరిగినప్పుడు శివుడిని పూజించండి. ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి. మనసులో చెడు ఆలోచనలు లేకుండా ఉండండి. అవసరమైన వారికి దానం చేయండి.
Read More:
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలవబోతున్న ఎన్టీఆర్.. ఎందుకంటే?
సలార్ గురించి గూస్ బంప్స్ తెప్పించే నిజాలు.. ఆ ఒక్క సీన్ కోసం ఇంత చేస్తున్నారా?
ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఇంతటి ఘోరానికి ఒడిగట్టారు.. అసలేం జరిగిందో తెలిస్తే కన్నీళ్లే!