Advertisement
మన భారతదేశంలో పెళ్లంటే నూరేళ్ళ పంట అనే విధంగా ఆలోచిస్తూ, మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం వివాహమనేది చేసుకుంటారు. వివాహం చేసుకోవాలంటే ముఖ్యంగా అమ్మాయి కట్టుబొట్టు, కుటుంబ నేపథ్యం అనేది చూస్తారు. అలాగే అమ్మాయి నుదుటి నుండి ఖాళీ పాదాలవరకు అన్ని గమనించాక వివాహం చేసుకుంటారు. కాలి వేళ్ళను బట్టి వాళ్లు సున్నితంగా ఉంటారా ధనవంతులా, రిస్క్ చేసే తత్వం ఉందా.. స్థిరంగా ఉంటారా.. అనే విషయాలను చూసేవారట.
Advertisement
ముఖ్యంగా అమ్మాయికి కాలి బొటనవేలు కంటే దాని పక్కనే ఉన్నటువంటి వేలు పొడవుగా ఉంటే అమ్మాయి చాలా గడుసుది అని, బొటన వేలు పొడవుగా ఉంటే ఎలా ఉంటారో అనే సందేహాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. కాలి వేలు అన్నింటిలో బొటన వేలు పొడవుగా ఉంటే వారు చాలా తెలివిగల వారట. అలాగే వీరికి సృజనాత్మకత కూడా ఎక్కువగా ఉంటుందట. బొటనవేలు అన్ని వేళ్ళకంటే పొట్టిగా ఉన్నటువంటి అమ్మాయిలు ఎలాంటి పనులు అయినా చాలా తేలికగా చేస్తారట. కాలి రెండో వేలు మిగతా వేళ్ళ కంటే పొడవుగా ఉండే అమ్మాయిల్లో చాలా నాయకత్వ లక్షణాలు ఉంటాయట.
Advertisement
డైనమిక్ గా ఉంటారట. ఇతరుల మీద ఆదిపత్యం ప్రదర్శిస్తారు. కాలి రెండో వేలు అన్ని వేళ్ళ కంటే పొట్టిగా ఉండే అమ్మాయిలు అందరితో తొందరగా కలిసి పోతారట. ఖాళీ మొదటి మూడు వేళ్ళు సమానంగా ఉండి, మిగతావి చిన్న గా ఉండే అమ్మాయిలు శక్తివంతంగా దృఢంగా ఉంటారట. ఇలాంటి అమ్మాయిల్లో ఊహించని శక్తి అనేది దాగి ఉంటుంది. మొదటి నాలుగు వేలు సమానంగా ఉంది, చిటికెన వేలు చిన్నగా ఉండే అమ్మాయిలు కుటుంబానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారట. వారి మాటలను చాలా శ్రద్ధగా వింటారు.