Advertisement
తెలంగాణాలో ఎన్నికల హడావిడి ముగిసిన సంగతి తెలిసిందే. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి విజయం సాధించారు. అయితే.. రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడు తొలుత టీఆరెస్ లోనే చేరారు. దాదాపు మూడు సంవత్సరాల పాటు కల్వకుర్తి నుంచి పోటీ చెయ్యడం కోసం టికెట్ కోసం ఎదురు చూశారట. అయితే టికెట్ రాకపోవడంతో.. చాల నిరాశ పడ్డారట. కానీ, అక్కడితో ఆగిపోకుండా బయటకి వచ్చి సొంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించారు. అక్కడ నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
Advertisement
ఇప్పుడు ఆయన ఓ ఫైర్ బ్రాండ్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. సాధారణ స్థాయి నుంచి సీఎం పదవి దాకా కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా రేవంత్ రెడ్డి కనిపించారు. కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అనగలిగే సత్తా ఉన్న నేతగా రేవంత్ రెడ్డి నిలిచారు. కానీ, ఒకప్పుడు ఆయన కెరీర్ ప్రారంభంలో కేసీఆర్ నిర్ణయం కోసం చాలానే ఎదురు చూసారు. 2004 లో రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇచ్చే టికెట్ కోసం ఆశగానే ఎదురు చూసారు. ఆ సమయంలో కేసీఆర్ రేవంత్ రెడ్డికి టికెట్ ఇచ్చి ఉంటె.. ఈరోజు రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీకి సవాల్ గా మారి ఉండేవాడు కాదేమో.
Advertisement
రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం చాలా వైవిధ్యంగా కొనసాగింది. కేసీఆర్ నిర్ణయం కోసం వెయిట్ చేసి చేసీ విసుగు చెందిన రేవంత్ రెడ్డి స్వతంత్రంగానే పోటీ చేసి.. నేడు సీఎం పదవికి ఎన్నికైన స్థాయికి ఎదిగాడు. 1992లో రేవంత్ రెడ్డి ఏబీవీపీలో యాక్టివ్ గా ఉండేవారు. ఆ తరువాత టీడీపీ కి మారినా.. కొద్దీ కాలానికే టిఆర్ఎస్ లో చేరారు. మూడేళ్లు చూసినా, టికెట్ రాకపోవడంతోనే ఆయన బయటకు వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా ప్రయత్నించారు.
Read More:
ఈ మూడు సందర్భాల్లో తప్ప.. స్త్రీ కన్నీళ్లు పెడితే.. ఆ ఇంటికి దరిద్రం పట్టినట్లే!
పటౌడీ ప్యాలెస్ లో యానిమల్ సినిమా షూటింగ్.. వైరల్ అవుతున్న ఫోటో వెనుక స్టోరీ ఏంటంటే?