Advertisement
మనం వేరే దేశానికి వెళ్లాలంటే వీసా అనేది తప్పనిసరి అవసరం అవుతుంది. అలాంటి వీసాలలో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా గోల్డెన్ వీసా అనేది ఉంటుంది. మరి ఈ వీసా అంటే ఏమిటి.. యూఏఈ గోల్డెన్ వీసాను ఎవరికి ఇస్తుంది..? అనేది ఓ సారి చూద్దాం..? యుఏఈ ఈ గోల్డెన్ వీసాలను విద్యార్థులకు సంబంధించి టాలెంట్ ఎక్కువగా ఉన్నవారికి ఇస్తుంది. అంటే సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ లో 95 శాతం మార్కులు వచ్చి ఉండాలి. అలాగే యూనివర్సిటీ లెవల్లో అయితే 3.75 జి పి ఏ రావాలి. ఇలాంటి వారికి గోల్డెన్ వీసాను అందిస్తారు.
Advertisement
Advertisement
అలాగే బిజినెస్ మెన్ లకు అక్కడి ప్రాజెక్టులో కనీసం కోటి రూపాయల పెట్టుబడి పెట్టి, మూడు సంవత్సరాల వరకు అలాగే ఉంచాలి. ఆ పెట్టుబడి ఎక్కడైనా లోన్ కానీ అప్పు కానీ తీసుకు రాకూడదు. అలాంటి వ్యాపారవేత్తలకు యూఏఈ గోల్డెన్ వీసాలను అందిస్తుంది. అలాగే సినిమా ఇండస్ట్రీ వాళ్లకు ఇందులో కూడా టాలెంట్ ఉన్న వ్యక్తుల విభాగానికి చెందిన వారికి మాత్రమే యూఏఈ వీసా ను అందిస్తుంది. తరచూ వీరు యూఏఈ కి ప్రయాణం చేస్తుండడం తో పాటుగా చాలా పాపులర్ స్టార్ అయి ఉండాలి. ఇలాంటి వారికి ఈ గోల్డెన్ వీసా అందిస్తుంది.
దీన్ని ఐదు నుంచి పదేళ్ల కు అందిస్తారు. ఈ వ్యవధి అనేది ముగిసాక వీసా అనేది ఆటోమేటిక్ గా రెన్యువల్ చేసుకోవచ్చు. ఈ వీసా దరఖాస్తు చేసుకోవడానికి యూఏఈ కి చెందినటువంటి మినిస్టరీ ఆఫ్ కల్చర్ అండ్ యూత్ యొక్క సిఫారస్ అనేది ఉండాలి. దీనికోసం ఆయా శాఖలకు చెందినటువంటి వెబ్సైట్లను ఓపెన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.