Advertisement
ఇంగ్లీష్ మీడియం చదువులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో అధికార, ప్రతిపక్షాల మధ్య వార్ నడుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలల్లోను ఇంగ్లీష్ మీడియం బోధనలు ఉండాలని ప్రయత్నాలు చేస్తోంది.
Advertisement
ఇప్పటికే చాలా పాఠశాలల్లో ఈ విధానాలను అమలు చేస్తూ వచ్చింది. ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యని అందించడమే లక్ష్యమని ప్రభుత్వం గతంలోనే పేర్కొంది. ఇందుకు తగ్గట్లే.. ఆంగ్ల మీడియంలో బోధనతో పాటు బైజూస్ కంటెంట్, మూడవ తరగతి నుంచే టోఫెల్ శిక్షణను అందుబాటులోకి తీసుకొచ్చింది.
తాజాగా.. ఈ విషయమై అధికార విపక్షాల మధ్య వివాదం మొదలైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ విషయమై వాగ్వాదాలు జరుగుతున్నాయి. మూడవ తరగతి చదివే పిల్లాడికి టోఫెల్ శిక్షణ అవసరమా? అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఈ విధానాల్లోనే ఎదో లోపం ఉందని.. ఇంగ్లీష్ రాకపోతే బతుకే లేదు అన్న తరహాలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇది ఇలా ఉంటె వైసీపీ ప్రభుత్వ నేతలు కూడా అదే తరహాలో కౌంటర్లు ఇస్తున్నారు.
Advertisement
పిల్లలు చదువుకుంటుంటే.. పవన్ కళ్యాణ్ కు ఇంత అక్కసు ఎందుకు అంటూ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. ఎవరు ఎలా అనుకున్నా.. కార్పొరేట్ స్కూళ్లకు తగ్గట్లే ప్రభుత్వ స్కూళ్లలో కూడా బోధన ఉంటుందని, అందుకు తగ్గట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దడమే మా లక్ష్యం అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇందుకు పెద్దగా ఖర్చు అయ్యేది కూడా ఏమీ లేదని అన్నారు. ఎన్ని మాటల యుద్ధాలు జరిగినా.. ఎవరు ఎలా అనుకున్నా.. విద్య వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే మా లక్ష్యం అని ప్రభుత్వం పేర్కొంటోంది.
- మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇవి చుడండి !