Advertisement
తాజాగా గురువారం లియో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఇప్పుడు హిట్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్లతో దూసుకెళ్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు కూడా బాగానే ఆదరిస్తున్నారు. అయితే.. ఈ సినిమాకు LCU కు సంబంధం ఉంది అంటూ ముందు నుంచే చర్చ జరుగుతోంది. తాజాగా.. ఇందుకు సంబంధించిన ఓ భారీ ట్విస్ట్ ను లోకేష్ రివీల్ చేసారు. అదేంటో ఈ ఆర్టికల్ లో చూసేయండి. లియోకు, LCU కు ఉన్న సంబంధం ఏంటి, ఈ సినిమాని ఖైదీ, విక్రమ్ సినిమాలతో ఎక్కడ కనెక్ట్ చేసాడో ఇప్పుడు చూద్దాం. ఈ కనెక్షన్ తెలియాలి అంటే ముందు నెపోలియన్ లియో సినిమాలోకి ఎలా వచ్చాడో తెలియాలి. డ్రగ్స్ పట్టుబడింది తిరుచ్చిలో అయితే.. హిమాచల్ ప్రదేశ్ కి ఎలా వచ్చాడు అన్న డౌట్ చాలామందికి ఉంది. ఖైదీ, విక్రమ్ సినిమాలలో కామన్ లింక్ ఏంటంటే 2 డ్రగ్ కంటైనర్లు. వీటిలో ఒకటి ప్రభంజన్ కొడుకు విక్రమ్ హ్యాండిల్ చేస్తాడు. మరోదాన్ని బిజాయ్ హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. ఆ డ్రగ్ బరస్ట్ అవ్వడంతో బిజాయ్ తన కుటుంబాన్ని కోల్పోతాడు. ప్రభంజన్ చనిపోతాడు.
Advertisement
ఈ కేసులో అసలేం జరిగింది? అనేది విక్రమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. బోర్డు రూమ్ లో విక్రమ్ గురించి ఇంట్రడ్యూస్ చేసే ఓ సీన్ ని విక్రమ్ సినిమా నుంచి రిమూవ్ చేశారట. ఈ సన్నివేశం విక్రమ్ సినిమాను LCU తో కనెక్ట్ చేసే విధంగా ఉంటుందట. ఆ సీన్ లో అమర్ ఘోస్ట్ గురించి స్పీచ్ స్టార్ట్ చేసినప్పుడు ఓ ఆఫీసర్ పక్క రూమ్ లో ఉన్న మిషన్ గన్ ను చూస్తాడు. ఈ గాన్ తో ఇప్పటివరకు అంతమందిని ఎదిరించింది నువ్వేనా? అంటూ ఆశ్చర్యపోతాడు. క్యామెరాని అటువైపు తిప్పితే అక్కడ ఉండేది నెపోలియన్. నిజానికి నెపోలియన్ ఆ గన్ ని మొయ్యలేడు. ఆ తర్వాత ఆ ఆఫీసర్ రూమ్ లోకి వెళ్ళిపోతాడు. దీన్ని బట్టి అర్ధం అయ్యేది ఏంటంటే డ్రగ్ ఇష్యూ వచ్చిన తరువాత నెపోలియన్ వచ్చేది విక్రమ్ లో.
Advertisement
ఇక లియో సినిమా కి వచ్చేసరికి నెపోలియన్ కి 60 రోజుల పోస్టింగ్ ఇస్తున్నట్లు ఆర్డర్స్ వస్తాయి. ఒక పేపర్ కటింగ్ కూడా చూపిస్తారు. ఇది తమిళంలో రాసి ఉంటుంది. ఇది జరిగేది తిరుచ్చిలో కాబట్టి ఆ ఆర్డర్స్ తమిళ్ లోనే ఉంటాయి. తెలంగాణ, ఏపీ స్టేట్స్ వచ్చినప్పుడు తెలుగులో ఉండేవిధంగా చూసుకున్నారు. బాగ్ కూడా మొయ్యలేని నెపోలియన్ మిషన్ గన్ ఎలా లేపాడు? అని లియో అడుగుతాడు. ఇక్కడ ఢిల్లీ రెఫరెన్సు వస్తుంది. LCU లో వచ్చే ఈ సీన్ ఖైదీ 2 నుంచే. ఈ సినిమాలో నెపోలియన్ కు ఎలివేషన్ ఇచ్చే టైం లో ఎక్కడా తగ్గలేదు.
ఇక క్లైమాక్స్ లో లియో ఐడెంటిటీ ఎవరికీ తెలియదు అనుకుంటుండగా ఓ కాల్ వస్తుంది. విక్రమ్ నుంచి ఆ కాల్ వస్తుంది. డ్రగ్స్ ఉన్న బిల్డింగ్ ని కాల్చేసిన వాళ్ళు మా ఆఫీస్ లో కూడా ఒకరు కావాలి అని అడుగుతాడు. చివర్లో తెలుసుగా నేనెవరో ? అని అంటాడు. అలా LCU కు లియోకి లింక్ కలుపుతారు. కానీ, అసలు లియో కు, విక్రమ్ కు సంబంధం ఎలా తెలుసు? అన్న విషయాన్నీ మాత్రం రివీల్ చెయ్యలేదు. దీనిని ఫ్యూచర్ లో రివీల్ చేసే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే లియోకి, విక్రమ్ కి ముందు నుంచి పరిచయం ఉందని, నెపోలియన్ ఇప్పుడు లియో పక్కనే ఉన్నాడని, నెక్స్ట్ పార్ట్ లో బిజాయ్ తో పాటు ఢిల్లీ వెళ్తాడు, వీరంతా కలిసి రోలెక్స్ ను ఎలా ఎదురిస్తారు? అన్న ప్రశ్న మిగిలిపోయింది. మొత్తానికి ఈ లింక్స్ చాలా ఎక్సయిటింగ్ గా అనిపిస్తున్నాయి కదా.