Advertisement
పాకిస్థాన్ పురుషుల క్రికెట్ జట్టు బుధవారం తమ అభిమానుల మధ్య భారత్‌కు చేరుకుంది. మరుసటి రోజు వారు హైదరాబాద్‌లో తమ మొదటి నెట్స్ సెషన్ లో పాల్గొన్నారు. పాకిస్తాన్ జట్టు ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023లో తమ మొదటి మ్యాచ్‌ని అక్టోబర్ 6న నెదర్లాండ్స్‌తో ఆడతారు. అంతకు ముందు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. వందలాది మంది అభిమానులతో బాబర్ ఆజం అండ్ కోకు హైదరాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. బాబర్, మహ్మద్ రిజ్వాన్ మరియు షాహీన్ షా ఆఫ్రిది తమ మొదటి ఇంప్రెషన్ ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. భారత్ కు వచ్చిన తరువాత చాలా ప్రేమగా ఫీల్ అయ్యామని తెలిపారు.
Advertisement
ఇవి కూడా చదవండి: మ్యాచ్ ఆడుతున్నప్పుడు టాయిలెట్ కి వెళ్లాల్సి వస్తే, క్రికెటర్స్ ఏమి చేస్తారు?
అక్కడ నుంచి హోటల్‌కి వచ్చిన తర్వాత డిన్నర్‌లో స్వీకరించిన ఆహారాన్ని పాకిస్థాన్ క్రికెటర్లు ఇష్టపడ్డారు. అక్కడ కూడా, పాకిస్తాన్ జట్టుకు హోటల్ సిబ్బంది హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. హైదరాబాదీ స్పెషల్ బిర్యానీ హైప్‌కు తగినట్లుగా ఉందని చెబుతూ క్రికెటర్లలో ఒకరు ప్లేట్ బిర్యానీ ఫోటోను పోస్ట్ చేశారు. వారికి తమ ప్లేట్స్ లో చికెన్, మటన్, చేపలు వడ్డించబడ్డాయి. అదనంగా, ప్రతిసారీ బటర్ చికెన్ మరియు బిర్యానీ వంటి మంచి డిలైట్స్ అందించబడతాయి. ప్రపంచకప్‌లో పాల్గొంటున్న పది జట్లలో ఎవరికీ, చివరకు పాకిస్తాన్ కి కూడా బీఫ్ వడ్డించబడదు.
Advertisement
ఇవి కూడా చదవండి: సూర్యకుమార్ యాదవ్ గురించి రాహుల్ ద్రవిడ్ ఏమన్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
భారతదేశంలోని ఫుడ్ మెనూలో ఏ బృందానికి గొడ్డు మాంసం అందించబడదు. పాకిస్తాన్ జట్టు హోటల్ ఫుడ్ మెనూలో లాంబ్ చాప్స్, మటన్ కర్రీ, హైదరాబాదీ బిర్యానీ, గ్రిల్డ్ ఫిష్, బటర్ చికెన్ మరియు వెజిటబుల్ పులావ్ ఉన్నాయి” అని ఒక పాకిస్థానీ జర్నలిస్ట్ మెనూలో రాశారు. ఈ రోజుల్లో కొంతమంది క్రికెటర్లు వారికి సరైన ఆహార పదార్థాలను సిద్ధం చేయడానికి వారి స్వంత చెఫ్‌ను కూడా తెచ్చుకుంటూ ఉంటారు. ఉదాహరణకు, హార్దిక్ పాండ్యాకు తన స్వంత వ్యక్తిగత చెఫ్ ఉన్నాడు. అతను తన సొంత హోటల్ సమీపంలో తన చెఫ్ కోసం ఒక హోటల్ లేదా అపార్ట్‌మెంట్‌ను బుక్ చేస్తాడు. చెఫ్ క్రికెటర్ యొక్క ఆహార అవసరాలను తెలుసుకొని కుక్ చేస్తారు. క్రికెటర్లకు వారి ప్లేట్స్ ఫుల్ గా ఆహార పదార్ధాలను అందించాల్సి ఉంటుంది.