Advertisement
ప్రతి మనిషిలో వెన్నుముక లోపల 72 వేలు నాడులు ఉంటాయి. ఈ నాడులను వెన్నెముకలు రక్షిస్తాయి. ఈ నాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం ఉంటుంది. ఇలాంటివి మనిషి శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర ఉంటుంది. ఈ మణిపూర చక్రంలో మధ్య భాగంలో “ఒడ్డీయాన పీఠం” ఉంటుంది. మన అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడా అందుకే ఒడ్డీయానం వాడుకలో ”వడ్యాణం” అంటారు. ఏడు చక్రాలలో శక్తి [గౌరీదేవి] ఏడు రూపాయలలో నిక్షిప్తమవుతుందనేది సిద్ధాంతం.
Advertisement
Also Read: కృష్ణయ్య ‘వెన్న’ ఎందుకు దొంగిలించేవాడు? దాని అర్థం ఏంటి ?
ఓడిబియ్యం అంటే అమ్మాయి ఒడ్యాణపీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం అన్నట్టు. ఒడ్డీయాన పీఠంలో ఉండే శక్తి రూపం పేరు మహాలక్ష్మి. ఓడిబియ్యం అంటే ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించడం అన్నమాట. అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువుల భావించి సత్కారం చేయాలి. అమ్మలు చిన్నపిల్లలను ఒడిలో పెట్టుకొని కాపాడుకుంటారు. ఓడి అంటేనే రక్షణ. ఒడిబియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుంది. వాళ్లకు తెలియకుండానే మహాలక్ష్మి గా మారిపోతారు. మహాలక్ష్మి మొదటి లక్షణం రక్షించడం. బిడ్డను, అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఓడి బియ్యం.
Advertisement
ఓడి బియ్యం లో ఒక బియ్యమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా పోస్తారు. ఇవన్నీ తమ బిడ్డను అష్ట ఐశ్వర్యాలతో ఉంచాలని తల్లివారు చేసే సంకల్ప పూజ మాత్రమే. సంతోషంలో ఆ మహాలక్ష్మి [ఆడపడుచు] తన తల్లి గారి ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఐదు పిడికిల్ల బియ్యం అమ్మవాళ్ళకు ఇచ్చి దేవున్ని ప్రార్థించి మహా ద్వారానికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి అత్తారింటికి వెళుతుంది. అక్కడ ఆడవాళ్లను పేరంటానికి పిలిచి అమ్మగారు ఇచ్చిన సారెను [ఐశ్వర్యాన్ని] ఊరంతా పంచుతుంది. ఇది అత్త వారు కూడా చేయవచ్చు. అందుకే ఓడి బియ్యం యొక్క విలువ, గౌరవం తెలుసుకోవడం ఇక్కడ ప్రధానం.
READ also : Rashi Phalalu in Telugu: ఈ రోజు రాశి ఫలాలు 2.08.2022