Advertisement
ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు. ఒక్కో హీరో ఒక్కో సినిమాకి లక్షల నుంచి కోట్ల దాకా రెమ్యూనరేషన్ తీసుకుంటారు. అయితే చాలామందికి వారి అభిమాన నటుడి వ్యక్తిగత విషయాలతో పాటు ఎంత పారితోషకం తీసుకుంటున్నారని విషయాన్ని తెలుసుకోవాలని ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఆస్తి విలువ ఎంత? ఆయన రాజకీయాల కారణంగా ఎంత కోల్పోయారు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి ఎన్నో పేరు ప్రఖ్యాతలు గడించారు. చిన్న హీరోగా కెరియర్ మొదలుపెట్టి తెలుగు సినిమాను శాసించే స్థాయికి వెళ్లారు చిరంజీవి.
Advertisement
Read also: పవన్ కళ్యాణ్ మొదటి పెళ్లి రహస్యంగా చేయడానికి కారణం..?
1978లో మొదటగా చిరంజీవి నటించిన చిత్రం ప్రాణం ఖరీదు. ఈ చిత్రానికి మెగాస్టార్ తీసుకున్న పారీతోషికం కేవలం రూ.25. ప్రస్తుతం రూ. 30 కోట్లకు పైగా తీసుకుంటున్నారు. 2009 సంవత్సరంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరఫున పాలకొల్లు మరియు తిరుపతి అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చిరంజీవి తన పేరుపై 33 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని అఫిడవిట్ లో పొందుపరిచారు. ఈ ఆస్తులలో 30 కోట్ల రూపాయల ఆస్తులు స్థిరాస్తులు అని, మూడు కోట్ల రూపాయల ఆస్తులు చరాస్తులు అని సమాచారం. ఇక చిరంజీవి ఎన్నికల సమయంలో తన భార్య పేరు పై ఆరు కోట్ల రూపాయల ఆస్తి ఉందని పేర్కొన్నారు.
Advertisement
అయితే చిరంజీవి ఆస్తుల విలువ వందల కోట్ల రూపాయలు ఉంటుందని నెట్టిజెన్లు భావిస్తున్నారు. అయితే ఇక్కడే కాక తమిళనాడు రాష్ట్రంలో కూడా చిరంజీవి ఆస్తులు బాగానే కూడా పెట్టారని సమాచారం. సినిమా పరిశ్రమ హైదరాబాద్ రాకముందు చిరంజీవి కుటుంబంతో కలిసి చెన్నైలో ఉండేవారు. అక్కడ కూడా చిరంజీవి కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో చిరంజీవి భారీగానే పెట్టుబడులు పెట్టారు. చిరంజీవి హీరోగా ఆయన కుమారుడు రాంచరణ్ పలు సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడంతోపాటు నిర్మాతగా రామ్ చరణ్ కు మంచి లాభాలను మిగల్చడం గమనార్హం.
Read also: ఐన్ స్టీన్ ఆహారపు అలవాట్లు ఏంటో తెలుసా…!