Advertisement
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి క్రికెట్ మైదానంలో తన అత్యుత్తమ ప్రదర్శనను చూపగలగడానికి అసలు కారణం ఏంటో తెలుసా? కోహ్లీ తీసుకునే డైట్. 34 ఏళ్ల కోహ్లీ ODI ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ సమయంలో తన పోషకాహారంపై చాలా శ్రద్ధ చూపించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సూపర్ స్టార్ ఇండియన్ అథ్లెట్, ప్రస్తుతం 5 ODI ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌లలో 354 పరుగులతో ఇండియన్ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్న సంగతి తెలిసిందే.
Advertisement
ODI ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ సందర్భంగా భారత క్రికెట్ జట్టు బస చేసిన హోటల్‌లలో ఒక హోటల్ నుండి చెఫ్ విరాట్ కోహ్లి ఆహారం గురించి పలు విషయాలను పంచుకున్నారు. లీలా ప్యాలెస్‌లోని ఎగ్జిక్యూటివ్ చెఫ్ మాట్లాడుతూ, లెజెండ్ విరాట్ కోహ్లీ ODI ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ సమయంలో తన ప్రోటీన్ ఫుడ్ కోసం టోఫు మరియు సోయా పై ఆధారపడుతున్నారని తెలిపారు. సాధారణంగా ఆటగాళ్ళు స్టీమ్డ్ లేదా గ్రిల్డ్ చికెన్ లేదా ఫిష్‌ను ఎంచుకుంటారు అని ఎగ్జిక్యూటివ్ చెఫ్ అనుష్మాన్ బాలి పేర్కొన్నారు.
Advertisement
కానీ విరాట్ మాంసాహారం ముట్టడని, వాటికి బదులుగా డిమ్ సమ్స్ వంటి ఆవిరితో కూడిన ఆహారాలను, సొయా, టోఫు, మాక్ మీట్, లీన్ వంటి ప్రోటీన్ ఫుడ్ తింటుంటాడని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కోహ్లీకి సంబంధించిన ఈ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. మైదానంలో అడుగుపెడితే, విరాట్ కోహ్లీ ఏ స్థాయిలో పరుగులు పెడతారో తెలిసినదే. అయితే.. అతని ఫిట్ నెస్ చూసి అబ్బురపడని వారు లేరు. అతని ఫిట్నెస్ వెనుక అసలు రహస్యం ఇదే అన్నమాట.
- మరిన్ని క్రికెట్ వార్తల ని ఇక్కడ మీరు చూడొచ్చు ! తెలుగు న్యూస్ కొరకు ఇటు చుడండి !