Advertisement
అయోధ్యలో నూతనంగా నిర్మించిన మందిరంలో బాల రాముడు కొలువు దీరాడు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా సోమవారం రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట క్రతువు వైభవంగా నిర్వహించారు. అయితే ఈ ప్రారంబోత్సవానికి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరు కాకపోవడంతో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Advertisement
వీటిని కూడా చదవండి: 32 ఏళ్ల అప్పుడే మోడీ శపథం.. అయోధ్య రామాలయానికి నేడు సాకారం..!
ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లు ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ హాజరు కావడంతో బీజేపీతో పొత్తు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు ఏపీ సీఎం జగన్ హాజరుకాకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి రామ మందిర ప్రతిష్ట మహోత్సవానికి దాదాపు 8వేల మంది అతిథులను శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఆహ్వానించింది. వీరిలో పలువురు సినీ తారలు, రాజకీయ నాయకులు, పీఠాధిపతులు, సాధువులున్నారు.
Advertisement
వీటిని కూడా చదవండి: ఈ ఫొటోలోని ప్రముఖ జ్యోతిష్యుడు ఎవరో గుర్తు పట్టారా ? అప్పట్లోనే ఇంత ఫేమస్ ?
ఈ తరుణంలో ఏపీ సీఎం జగన్ కి కేంద్రం నుంచి కానీ, నిర్వాహకుల నుంచి కానీ ఆహ్వానం అందిందా లేదా అనే దానిపై మాత్రం అధికారికంగా ఎలాంటి సమాాచారం లేదు. రాబోయే ఎన్నికలకు అభ్యర్థుల జాబితాలను ఖరారు చేసే పనిలో జగన్ బిజీగా ఉన్నారని.. పలు అధికారిక కార్యక్రమాలున్నాయని సీఎంఓ వర్గాలు తెలిపాయి. నిజానికి కేంద్రంతో జగన్ కి సత్సంబంధాలున్నాయనే చెప్పవచ్చు. వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డి వంటి వారు రామమందిర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు చెబుతూ ప్రకటనలు చేశారు. దీంతో కేంద్రం కూడా జగన్ కి ఆహ్వానం పలికి ఉంటుందని తెలుస్తోంది. మైనార్టీ ఓట్లు గల్లంతు అవుతాయనే అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్టకి దూరంగా ఉన్నట్టు పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ సీఎం జగన్ కి ఆహ్వానం అందిందా లేదా అనేది అధికారికంగా ప్రకటిస్తే కానీ తెలియదు.
వీటిని కూడా చదవండి: అయోధ్య రామ మందిరం కల సాకారం వెనుక పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కష్టం ఇంత ఉందా?