Advertisement
సూర్య కుమార్ యాదవ్, ఈ పేరు ఇప్పుడు ఇండియన్ క్రికెట్ లో ఓ వైబ్రేషన్. అద్భుతమైన ఆట తీరుతో చెలరేగిపోతున్నాడు సూర్య కుమార్ యాదవ్. ఆయన ఆటతీరుతో రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న సూర్య కుమార్ యాదవ్, ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆదివారం జింబాబ్వే తో జరిగిన మ్యాచ్ లోను సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు సూర్య కుమార్ యాదవ్. ఇక సూర్య ఇన్నింగ్స్ పై పలువురు క్రికెట్ విశ్లేషకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో గ్రూప్-2 లో ఉన్న భారత్ 5 మ్యాచ్ లో 4 గెలిచి సెమీ ఫైనల్ కు చేరుకుంది. బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ మూడింటిలో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు. అవి కూడా మామూలు ఇన్నింగ్స్ కా,దు బ్యాట్ జూళిపించాడు. లెగ్ సైడ్ అయినా, ఆఫ్ సైడ్ అయినా సిక్సర్లు బాదాడు. ఈ ఏడాది అంతర్జాతీయ టి20 లలో 1,000 కంటే ఎక్కువ పరుగులు చేసి అగ్రస్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ బిషప్, బీబీసీ తో మాట్లాడుతూ, ” ఈ మధ్యకాలంలో సూర్య కుమార్ కంటే శక్తివంతమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ను చూడలేదు. అతడికి క్రికెట్ బాల్ ఫుట్బాల్ లాగా కనిపిస్తుంది కాబోలు”” అన్నారు. సూర్య కుమార్ తన బ్యాట్ తో ప్రత్యార్థులను భయపెడుతున్నాడు.
Advertisement
సాధారణంగా, క్రిజు లోకి వచ్చి బ్యాటింగ్ మొదలు పెట్టాక, రెండు, మూడు బంతులు సేఫ్ గా ఆడతాడు. ఇక అప్పుడు ఒక బలహీనమైన బంతి కోసం వెయిట్ చేస్తాడు. చాలా షాట్లు లాఫ్టెడ్ లేదా 30 గజాల సర్కిల్ పైకి కొట్టడానికి ప్రయత్నిస్తాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్ వార్తాపత్రిక తరపున ఈ టోర్నమెంట్ ను కవర్ చేస్తున్న దేవేంద్ర పాండే, సూర్య కుమార్ యాదవ్ కెరీర్ ను చాలా కాలం నుంచి పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సూర్యపై దేవేంద్ర పాండే ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. “టూర్ లో ఉన్నప్పుడు సూర్య కుమార్ భార్య కచ్చితంగా ఒక నియమాన్ని పాటిస్తారు. మ్యాచ్ కు చాలాసేపటికి ముందే అతడి ఫోన్ తీసేసుకుంటారు. దానివల్ల అతడి పై అనవసర ఒత్తిడి ఉండదు. మానసికంగా అతడు మ్యాచ్ ఆలోచనలలో మునిగిపోతాడు. హాయిగా బ్యాటింగ్ చేస్తాడు” అని దేవేంద్ర పాండే రాశారు.
Read also: ఇంస్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న టాలీవుడ్ హీరోలు వీరే..!!