Advertisement
ఇప్పటికే అనేక అంచనాల మధ్య ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా గెలుపొందింది. అయితే ఆమె ప్రమాణ స్వీకారం అనంతరం ఎలాంటి సౌకర్యాలుంటాయి.. జీతం ఎలా ఉంటుంది.. అనే విషయాలు ఒకసారి చూద్దాం.. దేశంలోనే అత్యున్నత స్థానమైన రాష్ట్రపతి స్థానాన్ని మొదటిసారి గిరిజన మహిళ ముర్ము స్వీకరించ బోతున్నారు. ఈ క్రమంలో ప్రెసిడెంట్ కు ఎంత జీతం ఉంటుంది ఎలాంటి సౌకర్యాలు ఉంటాయనేది చాలామందిలో మెదులుతున్న ప్రశ్న. రాష్ట్రపతికి ప్రతినెల ఐదు లక్షల రూపాయల జీతం వస్తుంది. వైద్య,వసతి, ప్రయాణ సదుపాయాలు ఉచితంగా ఉంటాయి.
Advertisement
భారత రాష్ట్రపతితో పాటు అతని లేదా ఆమె జీవిత భాగస్వామి ప్రపంచంలో ఎక్కడైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. దేశంలో అత్యధిక వేతనం కూడా రాష్ట్రపతికే ఉంటుంది. 2017 వరకు ఈ వేతనం లక్షన్నర మాత్రమే ఉండేది. 2018లో 5 లక్షల రూపాయలు పెంచేశారు. జీతమే కాకుండా చాలా అలవెన్సులు ఉంటాయి. ఢిల్లీలో 340 గదులు, తోటలు ఉన్న రాష్ట్రపతి భవన్ వారి అధికార నివాసం. అందులోనే బస చేస్తారు. సాధారణంగా రాష్ట్రపతి ప్రీమియం వాహనాల్లో తిరుగుతారు. బెంజ్ లాంటి అత్యాధునికమైన కార్లలో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తారు.
Advertisement
ప్రెసిడెంట్ వాడే కారు బాంబులు, బుల్లెట్లు లాంటి వాటిని తట్టుకునేలా ప్రత్యేకంగా తయారు చేస్తారు. భారత ఆర్మీ విభాగంలోని ప్రత్యేక విభాగాలు రాష్ట్రపతికి బాడీ గార్డ్ గా ఉంటారు. వీరి రక్షణలో ఆర్మీ, వాయుసేన, నావికి చెందిన అగ్రశ్రేణి సైనికులు ఉంటారు. రాష్ట్రపతికి రెండు విడుదులు ఉన్నాయి. సమ్మర్ విడదీ సిమ్లా లో ఉంటే, శీతాకాలం విడిది హైదరాబాదులో ఉంది. రాష్ట్రపతి పదవి నుంచి రిటైర్ అయిన తర్వాత నెలకు లక్ష న్నర పెన్షన్ వస్తుంది. వారి యొక్క భాగస్వామికి కూడా 30 వేల రూపాయల పెన్షన్ వస్తుంది. ఉచిత నివాసం ఐదుగురు సిబ్బంది ఫోన్ రవాణా సదుపాయాలు ఉంటాయి.
also read:
ఉత్తమ్ సింగ్, సూర్యనారాయణ టైటిల్, పోకిరిగా ఎలా మారింది? దాని వెనుకున్న స్టోరీ ఇదే.