Advertisement
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనవరి 27వ తేదీ నుండి యువగళం పేరుతో పాదయాత్రని చేపట్టిన విషయం తెలిసిందే. అయితే పాదయాత్ర ప్రారంభించిన మొదటి రోజు నందమూరి తారక రామారావు మనవడు తారకరత్న గుండెపోటు కి గురయ్యారు. గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ఫిబ్రవరి 18న కన్నుమూశారు. అయితే కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని ఇంటికి తిరిగి వస్తారని కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ వర్గాల వారు భావించారు. కానీ వారి ప్రార్థనలు మాత్రం ఫలించలేదు.
Advertisement
Read also: “కొమరం భీముడొ” పాటలో ఎన్టీఆర్ ని రామ్ చరణ్ కొరడాతో కొట్టడం వెనక ఇంత స్టోరీ ఉందా ?
సుదీర్ఘంగా 23 రోజులపాటు మరణంతో పోరాడిన ఆయన ఫిబ్రవరి 18న 9 గంటల 40 నిమిషాల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. కేవలం 39 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు తరలి వెళ్ళిపోయారు. ఈ వార్తతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ అంతా ఆశ్చర్యపోయింది. ప్రధాని మోదీ మొదలు సినీ, రాజకీయ రంగాలకు చెందిన వారంతా సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. ఇదిలా ఉంటే.. తారకరత్న శివరాత్రి రోజు శివైక్యం అయ్యారు. అయితే రెబల్ స్టార్ కృష్ణంరాజు తమ్ముడు, ప్రభాస్ నాన్న ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు కూడా శివరాత్రి రోజునే శివైక్యమయ్యారు. ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు ఫిబ్రవరి 12, 2010న తిరిగిరాని లోకాలకు వెళ్లారు.
Advertisement
అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయి దంపతులకు కుమారుడు అఖీరా తర్వాత కుమార్తె ఆద్య జన్మించిన సంగతి తెలిసిందే. ఆద్య 2010లో శివరాత్రి రోజు పుట్టినట్లు సమాచారం. ప్రభాస్ తండ్రి, అలాగే తారకరత్న ఇద్దరు కూడా శివరాత్రి రోజు శివైక్యం కావడం యాదృచ్ఛికం. కాగా మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలను కుటుంబ సభ్యులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. 40 ఏళ్లు కూడా నిండకుండానే తారకరత్న మరణించడం అందరినీ కలిచివేస్తోంది. ముఖ్యంగా పుట్టినరోజుకు నాలుగు రోజుల ముందు చనిపోయాడు ఈయన. ఫిబ్రవరి 22న తారకరత్న జయంతి. దానికి నాలుగు రోజుల ముందే మరణించడంతో కుటుంబ సభ్యులు కుమిలిపోతున్నారు.
Read also: హిట్ అవ్వాల్సిన ఎన్టీఆర్ సినిమా ఆ స్టార్ హీరో కారణంగా అట్టర్ ప్లాప్ అయిన మూవీ ఏదంటే ?