Advertisement
ఎంతో అవగాహన, నైపుణ్యం ఉంటేనే ఒక సినిమాను చేయగలరు. అయితే ఎలాంటి అవగాహన లేకుండా సినిమా తీస్తాము అని ముందుకు వస్తే తప్పకుండా ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది. అంతేకాకుండా ప్రొడ్యూసర్ కి కూడా ఎంతో నష్టాలు వస్తాయి. కాబట్టి డైరెక్టర్ ఎప్పుడూ కూడా అన్ని కోణాలలో ఆలోచించి మంచి నిర్ణయాలను తీసుకోవాలి. అలా అయితేనే ఆ సినిమా హిట్ అవుతుంది. ఎంతోమంది డైరెక్షన్ తో సంబంధం లేకుండా నైపుణ్యం లేకపోయినా సరే కో డైరెక్టర్ పై ఆధారపడి సినిమాను తీయవచ్చు అని భ్రమలో ఉంటారు. అది ఎప్పటికీ వర్కౌట్ కాదు. పైగా అటువంటి డైరెక్టర్లు ఎక్కువ కాలం సినిమా ఇండస్ట్రీలో ఉండలేరు.
Advertisement
రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ వంటి వారు ప్రస్తుతం చాలా కష్టపడి ఇండస్ట్రీ పేరును పైకి తీసుకురావాలని ముందుకు వెళ్తున్నారు. రాజమౌళి అయితే పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్ లో ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది మరియు సుకుమార్ కొరటాల శివ వంటి వారు మంచి విజయాన్ని సాధించాలని ఎంతో కష్టపడుతున్నారు. ఈ సంవత్సరం అతి పెద్ద సినిమాల్లో దేవర, పుష్ప 2 విడుదల అవుతాయి.
Advertisement
Also read:
అయితే ఈ రెండు సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 27న దేవర సినిమా విడుదల అవుతుంది. దీనికి సంబంధించిన షూట్ ను అతి త్వరలో పూర్తి చేయాలని సినిమా బృందం నిర్ణయించుకుంది. డిసెంబర్ 6వ తేదీన పుష్ప 2 సినిమా విడుదల అవుతోంది. ఈ రెండు సినిమాలకు కూడా చాలా ఎక్కువ కలెక్షన్లు వసూలు అవుతాయి అని అందరూ అంచనా వేస్తున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!