Advertisement
భారతదేశంలో ఆషాఢ పూర్ణిమ నుండి నాలుగు మాసాల పాటు చాతుర్య మాసంగా బావిస్తూ ఉంటారు. పూర్వకాలంలో శిష్యులు మరియు గురువులు కూడా ఈ నాలుగు మాసాలు వర్షాకాలం అయినందున ఎలాంటి పర్యటనలు దేశసంచారాలు చేయకుండా, ఒకే చోట తాత్కాలికంగా నివాసాన్ని ఏర్పరచుకొని ఆ సమయంలో శిష్యులు గురువు దగ్గర విజ్ఞాన సముపార్జన చేసేవారు. ఇందులోభాగంగా మొదటిరోజు గురువును ఆరాధించడం ప్రత్యేకం. ఈ సాంప్రదాయమే కాలక్రమేణా గురుపౌర్ణమిగా మారిపోయిందని చరిత్ర చెబుతోంది.
Advertisement
ఆదిగురువు వేదవ్యాసుడు పుట్టినరోజునే గురుపూర్ణిమ, లేదంటే వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు. వ్యాసపూర్ణిమ అంటే గురువులను ఉపాధ్యాయులను పెద్దలను పూజించే రోజు అన్నమాట. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు లాంటివి ఇస్తూ ఉంటారు. వశిష్ట మహాముని మనవడు, శక్తి మహాముని మనవడు, పరశురామునికి పుత్రుడు, సుఖ మహర్షికి జనకుడు అయినటువంటి వేద వ్యాసుల వారి పుట్టినరోజున గురుపూర్ణిమ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
Advertisement
సాక్షాత్తు నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసులవారు. అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు. ఆయన వల్లే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాలను అందించిన మహానుభావుడు వ్యాసుల వారే. వేద వ్యాసుని తల్లిదండ్రులు సత్యవతి పరశురాముడు. వ్యాసుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించి, పైలుడు అనే శిష్యుడికి ఋగ్వేదాన్ని, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, జైమిని అనే శిష్యుడికి సామవేదాన్ని, సామాన్యుడికి అధర్వణ వేదాలను వారికి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు వేదవ్యాసుని పూజిస్తే మనకు విశేష ఫలితాలు అందుతాయని నమ్ముతారు.
also read:
ఉదయ్ కిరణ్ చెల్లెలు కూడా టాలీవుడ్ స్టార్ సింగర్ అని మీకు తెలుసా..?