Advertisement
ఈ మధ్యకాలంలో చాలా మంది సినీ ప్రముఖులు సినిమాలు లేకపోవడంతో అందరూ సోషల్ మీడియాలో బాట పట్టారు. ఇందులో ప్రముఖంగా గాయకులు, గాయకురాలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, యాంకర్లు ఇలా అనేకమంది సినీ వర్గానికి చెందిన చాలామంది సోషల్ మీడియా బాట పట్టారు. కొన్ని రోజుల క్రితం వరకు ఎలాంటి సినిమా షూటింగ్స్ జరగకపోవడంతో ఆదాయాన్ని ఆర్జించలేకపోయారు. అంతేకాదు మరి కొందరు అటు టీవీ రంగంలోనూ ఇటు వెండితెరపై స్థానాన్ని సంపాదించడం కోసం సోషల్ మీడియాను పర్ఫెక్ట్ ప్లాట్ ఫామ్ గా చేసుకొని అనేక రకాల ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉన్నారు.
Advertisement
ప్రస్తుతం బుల్లితెర, బిగ్ స్క్రీన్, యాంకర్లు, యూట్యూబ్ లోకి ఎంటర్ అయిన కొత్తలో వారు వ్యక్తిగత విషయాలు, హోమ్ టూర్ లు, ఫ్రిడ్జ్ టూర్ లు ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసేవారు. కానీ ప్రస్తుతం ఆ ట్రెండ్ మారింది. షాపింగ్ వీడియోలు పెడుతున్నారు. కారు, బంగారం, ఇల్లు కొన్నాం అంటూ వరుసగా షాపింగ్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం బిగ్ బాస్ ఫేమ్ హిమజ, బీఎండబ్ల్యూ కారు కొన్నాను అంటూ వీడియో అప్లోడ్ చేసింది. కారు ధర, ఫీచర్లు ఇలా వివరాలు చెప్పుకోస్తూ, ఆఖరిలో భారీ షాక్ ఇచ్చింది. తాను కారు కొనడం, దాని ఫీచర్లను ఎక్స్ ప్లెయిన్ చేయడం కల అంటూ వివరణ ఇచ్చింది.
Advertisement
ఈ వీడియో చూసిన తర్వాత సోషల్ మీడియాలో, సెలబ్రిటీలు పోస్ట్ చేసే షాపింగ్ వీడియో ల మీద చర్చ మొదలయ్యింది. అంటే వాళ్ళు షాపింగ్ చేయకపోయినా, ఆయా మాల్స్, బ్రాండ్స్ కి సంబంధించిన ఉత్పత్తులను ప్రమోట్ చేయవచ్చు అనే విషయం హిమజ పోస్ట్ చేసిన బీఎండబ్ల్యూ కారు వీడియో ద్వారా అర్థం అయింది. దీని ప్రకారం చూస్తే, కొందరు సెలబ్రిటీలు, నెలలో 4-5 షాపింగ్ వీడియోలు పోస్ట్ చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చాలామంది సెలబ్రిటీలు, బంగారం కొన్నాం, ఆభరణాలు తీసుకున్నాం, ఖరీదైన పట్టు చీరలు కొన్నాం అంటూ అప్లోడ్ చేసే వీడియోలు అన్ని ప్రమోషన్ వే అయి ఉండవచ్చు. ఎంత సెలబ్రిటీలు అయినా సరే, నెలలో పది సార్లు బంగారం, బ్రాండెడ్ బట్టలు షాపింగ్ చేసేంత సీన్ ఉండదు. వీరంతా తమ అతి తెలివితో జనాలు పిచ్చి వాళ్లను చేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రమోషన్ల కోసం మరి ఇంత కక్కుర్తి పడాలా అని ట్రోల్ చేస్తున్నారు.