Advertisement
Actress Soundarya Husband: ప్రముఖ టాలీవుడ్ నటి సౌందర్య ప్రస్తుతం భౌతికంగా మన మధ్య లేకున్నా.. ఆమెను తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. చాలా మంది టాప్ హీరోలతో ఆమె జంట కట్టారు. సావిత్రి తరువాత తెలుగునాట మళ్ళీ అంతలా ప్రేక్షకుల హృదయాలను కదిలించిన నటి ఎవరైనా ఉన్నారా అంటే అది సౌందర్య గారే. ఆమె ఇప్పుడు భౌతికంగా లేకున్నా ఆమెకు అభిమానులు మాత్రం కోకొల్లలు. అంతలా ఆమె తన ప్రతిభతో అభిమానుల గుండెల్లో తిష్ట వేశారు.
Advertisement
వీటిని కూడా చదవండి:చిరు చేసిన తప్పే పవన్ కళ్యాణ్ కూడా చేస్తున్నారా?
కేవలం తెలుగే కాదు.. సౌందర్య హిందీ, మలయాళం, కన్నడ సినిమాల్లో కూడా నటించారు. సౌందర్య నార్త్ ఇండస్ట్రీని కూడా ఓ ఊపు ఊపారు. 2000 లలో ఈమె టాప్ హీరోయిన్ గా కొనసాగారు. అయితే.. సౌందర్య తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితుడు రఘుని వివాహం చేసుకున్నారు. అయితే.. వైవాహిక జీవితపు అదృష్టం మాత్రం ఆమెకు తగ్గలేదు. కారణం ఏంటంటే హెలికాఫ్టర్ ప్రమాదం. పెళ్లి చేసుకున్న సంవత్సరానికి ఆమె హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ఓ రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేయడం కోసం ఆమె హెలికాఫ్టర్ లో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Advertisement
వీటిని కూడా చదవండి: త్రివిక్రమ్ ను ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చిన ఆ లేడీ రచయిత ఎవరో తెలుసా?
ఆమె భర్త రఘుని ఆమె మరణం చాలా కృంగదీసింది. ఆమె మరణించిన తరువాత ఆమె భర్త రఘు ఆమె జ్ఞాపకార్ధం అనేక సేవాకార్యక్రమాలు నడిపిస్తున్నారు. సౌందర్య పేరు మీద ఓ స్కూల్ ని కూడా నడుపుతున్నారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అని అభిమానులు కలవరపడుతున్నారు. ప్రస్తుతం ఆయన డాక్టర్ అర్పితను రెండవ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరు విదేశాల్లోనే స్థిరపడ్డారు.
వీటిని కూడా చదవండి: ఈ కమెడియన్స్ భార్యలు ఎంత అందంగా ఉన్నారో చూశారా?