Advertisement
డబ్బులు లేకపోతే ఏదీ లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా డబ్బులు ఉండాలి. లేకపోతే ఏమి ఉండవు. అయితే ఒక్కోసారి మనం పొరపాటున చిరిగిపోయిన నోట్లు తీసుకుంటూ ఉంటాం. అటువంటి నోట్లు మనం ఎవరికీ ఇవ్వాలన్నా అవి చెల్లవు. చిరిగిపోయిన లేదా పాడైపోయిన మరకలు పడిన నోట్లను ఎలా మార్చుకోవాలి అని చాలామంది వర్రీ అవుతూ ఉంటారు. ఏ టెన్షన్ పడక్కర్లేదు. ఈజీగా ఇటువంటి నోట్లను మార్చుకోవడానికి అవుతుంది. RBI శాఖ కార్యాలయం లేదా మీకు సమీపంలో ఉన్న బ్యాంకులో ఎటువంటి నోట్లను మార్చుకోవచ్చు.
Advertisement
చిరిగిపోయిన నోట్లు, పాడైపోయిన నోట్లు, మరకలు అంటుకున్నవి అన్నీ కూడా మారతాయి. సాధారణంగా అలాంటి కరెన్సీ నోట్ల విలువ 5000 వరకు ఉండి నోట్ల 20 వరకు ఉంటే వాటిని ఎలాంటి రుసుము చెల్లించకుండా ఉచితంగా బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవచ్చు. 20 నోట్లు కంటే ఎక్కువ ఉండి వాటి విలువ 5 వేలకు మించిందే మాత్రం బ్యాంకులో కొంత రుసుము వసూలు చేసి ఆ నోట్లను మార్పిడి చేస్తాయి.
Advertisement
Also read:
Also read:
అలాంటి నోట్ల విలువ 50 వేలుకు మించితే మాత్రం బ్యాంకులు కాస్త జాగ్రత్తలు తీసుకుంటాయి. వివరాలు అన్ని పూర్తిగా చేసుకొని కొంత ఎక్కువ రుసుముతో నోట్లను మార్పిడి చేస్తాయి. బ్యాంకుల్లో రోజుకు 20 నోట్ల వరకు మాత్రమే మార్పిడి చేయడానికి అవుతుంది. వాటి విలువ 5000 లేదా అంతకంటే తక్కువలో ఉండాలి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!