Advertisement
టాలీవుడ్ నటుడు ఆలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరోగా అలాగే కమెడియన్ గా ఆలీ.. మంచి మార్కులు కొట్టేశారు. అయితే అంతటి నటన, టాలెంట్ ఉన్న ఆలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సీఎం జగన్ తో పాటు పలువురు స్టార్ సినీ సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Advertisement
Read also: పూరి జగన్నాథ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరోయిన్లు వీరే..!!
ఈ తరుణంలోనే ఆలీ అల్లుడు గురించి సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వస్తున్నాయి. ఆయన ఏం చేస్తారు, వారి బ్యాగ్రౌండ్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫాతిమా ఆలీ చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉంటూ డాక్టర్ కోర్స్ పూర్తిచేసి వారి కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్ అయ్యింది. ఇక ఆలి అల్లుడు విషయానికి వస్తే, జమీలా బాబి, జలాని బాయ్ దంపతుల కుమారుడు షెఫ్యాజ్.
Advertisement
ఆయనకు ఒక అన్నయ్య ఒక సోదరి ఉన్నారు. అన్నయ్య, వదినతో పాటు తన సోదరి కూడా డాక్టరే. వీరంతా లండన్ లో ఉంటారు. షెఫ్యాజ్ కుటుంబం ఆర్థికంగా కాని, విద్యాపరంగా కానీ ఎంతో ఉన్నత కుటుంబం. ఇంట్లో అందరూ డాక్టర్లే కావడంతో షెఫ్యాజ్ కూడా ఎంతో కష్టపడి డాక్టర్ చదివారు. ఇక ఆలీ కూడా తన కుమార్తె డాక్టర్ కావడంతో అల్లుడు కూడా డాక్టర్ కావాలని ఏరి కోరి మరి సంబంధాన్ని ఓకే చేశారట. షెఫ్యాజ్ కుటుంబం గుంటూరుకు చెందినవారు. ఈ విధంగా ఆలీ కుమార్తె పెళ్లి సందడి సందడిగా సకుటుంబ సపరివార సమేతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా హ్యాపీగా జరిగింది అని చెప్పవచ్చు.
Read also: మహేష్ బాబు ‘అతడు’ సినిమా ఆ చిత్రానికి కాపీయా.. త్రివిక్రమ్ అక్కడ లేపేశాడా..?