Advertisement
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచనాలను సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై 2500 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇక బాహుబలి క్యారెక్టర్ లో ప్రభాస్ నటన అత్యద్భుతమని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో ప్రతి సన్నివేశం కూడా చాలా అద్భుతంగా తెరకెక్కించారు రాజమౌళి. ఇలా చెబుతూ పోతే బాహుబలి చిత్రం గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే.
Advertisement
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ (AI) వినియోగం బాగా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి ఈ చిత్రంలో ఓ సన్నివేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ వీడియో ఏంటంటే.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కేవలం తమిళ్ లోనే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా సుపరిచితమే. అయితే బాహుబలి చిత్రంలో ప్రభాస్ శివలింగాన్ని తల్లి కోసం ఎత్తుకొని తీసుకువెళ్లి జలపాతం కింద పెట్టే సన్నివేశం అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది.
Advertisement
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వినియోగం పెరగడంతో ఆ సన్నివేశంలో ప్రభాస్ కి బదులుగా విజయ్ ఉంటే ఎలా ఉంటుందని AI ని ఉపయోగించి వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ప్రభాస్ అభిమానులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ ద్వారా స్పందించడం మొదలుపెట్టారు. బాహుబలి సినిమాల్లో ప్రభాస్ కు తిరుగులేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియోపై ఓ నెటిజన్ ఇంకెందుకు.. అనుష్క, బల్లాలదేవా ని కూడా చేసేయండి.. సినిమా మొత్తం సింగిల్ పార్ట్ లో అయిపోతుందంటూ హాస్యంగా కామెంట్ చేశాడు. అతను పెట్టిన కామెంట్ అయితే అందరికీ నవ్వు పుట్టిస్తుంది.
#ThalapathyVijay In and As #Baahubali
AI can do Everything for You 😉 pic.twitter.com/OeCSMiR8qc
— Movies4u Official (@Movies4u_Officl) August 27, 2023
Also Read :
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ కి ఇష్టమైన స్టార్ హీరోస్ ఎవరంటే..?