Advertisement
తాజాగా తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యిని వాడుతున్నారని తెలిసింది. అయితే తెలంగాణ తిరుపతిగా పేరుపొందిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రసాదంలో ఏ నెయ్యిని ఉపయోగిస్తున్నారు అనే అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్తీలు ఎక్కువ అవుతున్నాయి, మనుషులు తినే ఆహారంతో పాటుగా ఉపయోగించే వస్తువుల్లో కూడా చాలా కల్తీలు జరుగుతున్నాయి. అదే విధంగా తిరుమల లడ్డులో జంతువుల కొవ్వును ఉపయోగించిన నెయ్యిని వాడుతున్నారని తెలిసింది. అయితే ఈ సమస్య కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తిరుమలలో కల్తీ నెయ్యి బయటపడడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
Advertisement
Advertisement
అదే విధంగా తెలంగాణ రాష్ట్రం లో ప్రధాన ఆలయాల్లో ప్రసాదం తయారీ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అందించారు. ఇక ప్రైవేట్ సంస్థల నుండి నెయ్యిని కొనుగోలు చేయొద్దని కేవలం విజయ డైరీ నుండి మాత్రమే కొనుగోలు చేయాలని ప్రకటించారు. తిరుమలలో ఏ విధంగా అయితే టెండర్ విధానాన్ని పక్కనపెట్టి కేవలం విజయ డైరీ నుండి మాత్రమే నెయ్యి కొనుగోలు చేయాలని నిర్ణయించారో అదే విధమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలైన వేములవాడ, వరంగల్ భద్రకాళి, ధర్మపురి తో పాటు అనేక దేవాలయాలు విజయ డైరీ నెయ్యిని కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాయి. యాదాద్రి ఆలయానికి వెళ్లే భక్తులు స్వామివారిని దర్శించుకుని లడ్డు, పులిహోర ప్రసాదాన్ని స్వీకరిస్తారు. దాంతో యాదాద్రిలోనే ప్రతిరోజు 20 నుండి 30 వేల వరకు లడ్డూలను భక్తులు కొనుగోలు చేస్తారు. ఈ ప్రసాదాల తయారీలో ఉపయోగించే నెయ్యిని కేంద్ర ప్రభుత్వ సంస్థ మదర్ డైరీ నుండి కొనుగోలు చేస్తున్నారు అయితే ఇప్పుడు కేవలం విజయ డైరీ నుండి మాత్రమే నెయ్యి కొనుగోలు చేయాలని నిర్ణయించారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!