Advertisement
హోటళ్లలో మనం చూసినట్లయితే బెడ్ షీట్లు తెల్లటి రంగులో ఉంటాయి. తెలుపు రంగు త్వరగా మాసిపోతుంది కదా..? మరి ఎందుకు హోటల్స్లో తెలుపు రంగుని మాత్రమే వాడతారు దాని వెనుక కారణమేంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఏదైనా హోటల్ లో మనం షేర్ చేసినప్పుడు అక్కడ ఉన్న బెడ్ షీట్లు కర్టెన్లు అన్నీ కూడా తెల్లగా ఉంటాయి. చూడడానికి మెరిసిపోతూ ఉంటాయి. మంచి రాయల్ లుక్ ని ఇస్తాయి. అయితే ఆస్తమాను వాటిని వాష్ చేయాలి ఎక్కువ మెయింటైన్ చేయాలి కదా ఎందుకు తెల్లటి వాటిని ఇస్తారు..? ఏదైనా మంచి రంగుని ఇవ్వచ్చు కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు.
Advertisement
అయితే ఈ తెల్లటి బెడ్ షీట్లు వెనక పెద్ద కారణమే ఉంది. తెలుపు రంగు శుభ్రతని సూచిస్తుంది. శుభ్రతని సూచించేందుకే ఇలా హోటల్స్ లో తెల్లటి బెడ్ షీట్లని వాడతారు అలానే హోటల్స్ లో ఉపయోగించేవన్నీ తెల్లటివే కాబట్టి ఒకేసారి వాటిని ఉతికేటప్పుడు సమస్య రాదు. వేరే రంగు వాటిని వాడినట్లయితే రంగు అంటుకుపోయే అవకాశం ఉంటుంది కానీ అన్నిటిని చక్కగా తెల్లటి వాటిని వాడితే ఈ సమస్య ఉండదు.
Advertisement
Also read:
తెలుపు రంగు బెడ్ షీట్స్ వలన ఏ కలర్ గదికైనా ఇట్టే సెట్ అయిపోతుంది చూడడానికి డిఫరెంట్ గా అనిపించదు. చక్కగా అందంగా ఉంటుంది కూడా. పైగా తెలుపు రంగు లగ్జరీ ఫీలింగ్ ని సూచిస్తుంది కాబట్టి ఇలా ఈ కారణాల వలన హోటల్స్ లో తెల్లటి బెడ్ షీట్లను వాడతారు. మరి మీ డౌట్ కూడా క్లియర్ అయిపోయింది కదా..? అందుకనే హోటల్స్ లో ఎక్కడ చూసినా కూడా తెల్లటి బెడ్ షీట్లు మనకి కనబడుతూ ఉంటాయి. దీంతో రూమ్ ఇంకా అందంగా కనబడుతూ ఉంటుంది. లగ్జరీ ఫీలింగ్ ఇస్తుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!