Advertisement
మనం రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక రైల్వే సంకేతాలు, చిహ్నాలను చూస్తూ ఉంటాం. వాటిలో కొన్ని చిహ్నాల గురించి మనకు తెలిస్తే తెలియని మరెన్నో సంకేతాలు రైల్వే స్టేషన్లలో మరియు రైళ్లపై కనిపిస్తూ ఉంటాయి. వాటిలో ముఖ్యమైనటువంటి చిహ్నం కోచ్‌లపై ఉండే రంగు చారలు. వీటి అర్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. మీరు నీలం ఐసీఎఫ్ కోచ్‌ల్లో ప్రయాణిస్తున్నట్లయితే, చివరి విండో పైన పసుపు లేదా తెలుపు చారలను చూడవచ్చు.
Advertisement
ALSO READ:చిరు, బన్నీ, నాగ్, ఎన్టీఆర్ ప్రభాస్..సొంత జెట్ విమానాలు ఉన్న తెలుగు హీరోలు..!!
Advertisement
తెల్లటి గీతలు రిజర్వ్ చేయని సెకండ్ క్లాస్ కోచ్‌లను సూచిస్తాయి. ఒక్కోసారి రైల్వే ప్లాట్ ఫారం పై ఆగి ఉన్నప్పుడు ప్రయాణికులకు, జనరల్ కోచ్‌లను గుర్తించడం కొన్నిసార్లు కష్టమే. కాబట్టి, రైలు స్టేషన్‌లోకి ప్రవేశించగానే వారు సింబల్ ద్వారా జనరల్ కోచ్‌ను సులభంగా గుర్తించగలరు. అలాగే నీలం మరియు ఎరుపు కోచ్‌లపై వికర్ణ పసుపు చారలను చిత్రీకరించి నట్లయితే, కోచ్‌లో శారీరకంగా వికలాంగులు, అనారోగ్యంతో ఉన్న ప్రయాణీకుల కోసం ఉద్దేశించినవి అని మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా, మీరు బూడిద రంగు కోచ్‌లో ఆకుపచ్చ, ఎరుపు చారలను కూడా గుర్తించవచ్చు.
ఆకుపచ్చ గీతలు కోచ్ లు మహిళల కోసం కేటాయించినట్టు అర్థం చేసుకోవాలి. భారతీయ రైల్వే ఆసియాలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్. అలాగే ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ కావడం గమనార్హం. 1853 ఏప్రిల్ 16న బొంబాయి నుండి థానే వరకు 14 భోగి లతో కూడిన మొదటి ప్యాసింజర్ రైలు 400 మంది ప్రయాణికులతో 34 కిలోమీటర్లు ప్రయాణం చేసింది.ఇక అప్పటి నుంచి ఏప్రిల్ 16వ తేదీన భారత రైల్వే రవాణా దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
ALSO READ: