Advertisement
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ, గతంలో ఆయన టీడీపీ పార్టీకి సపోర్ట్ చేసిన సంగతి విదితమే. కానీ గతంలో కొన్ని సార్లు ఆయన అవమానాలు ఎదుర్కొనాల్సి రావడంతోనే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అన్న విషయం బహిరంగంగానే వినిపిస్తున్న వాదన. ఇది ఇలా ఉంటె..
Advertisement
ఇవి కూడా చదవండి: జగన్ జాతకం గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిన వేణుస్వామి…. ఏమన్నారంటే?
ప్రస్తుతం జైల్లో చిక్కుకున్న పరిస్థితులలో చంద్రబాబు నాయుడుకు సాయం చేసేది బిజెపి పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ నా లేక ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆర్ నా అన్న విషయం గురించి పద్మాకర్ దగ్గుమాటి అనే ఓ రచయిత రాసిన కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి: కేటీఆర్ కు ఫోన్ చేసిన నారా లోకేష్.. ఆ అనుమతి కోసమే అంటూ.. అసలు విషయం ఏంటంటే?
నిజానికి జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ బాధ్యతలు తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం చాలా మందికి ఉంది. ఆయనకు సరైన మాటతీరు, సంఘంలో గుర్తింపు, గౌరవం, అభిమాన గణం, నాయకత్వ లక్షణాలు అన్నీ ఉంటాయి. అయితే పార్టీ నాయకత్వాన్ని ఆయనకీ ఎందుకు అప్పగించకూడదు? అని చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది.
ఒక పార్టీని డబ్బుతో మేనేజ్ చేయడం, పాజిటివ్ రెస్పాన్స్ తో మేనేజ్ చేయడం అనేవి పాతకాలం టెక్నీక్ లు. ఇప్పుడు వీటికి కాలం చెల్లింది. ప్రస్తుతం బలమైన ప్రతిపక్షం అవసరం ఉంది. కానీ ప్రస్తుత పార్టీలు అధికార పార్టీని దుమ్మెత్తిపోయడం ఒకటే లక్ష్యంగా పెట్టుకుంటున్నాయి.
Advertisement
దీనితో రాజకీయాలు అంటేనే పెంటపై రాయి వేయడం అనే స్టేజికి చాలా మంది వచ్చేసారు. దశాబ్దాల తరబడి బిజెపి పార్టీని ఆంధ్రాలో పాగా వెయ్యనివ్వకుండా టీడీపీ బాగానే కష్టపడింది. కానీ, ఇప్పుడు టీడీపీని సమూలంగా తుడిచిపెట్టేసేలా బిజెపి పావులు కదుపుతోంది అన్నది కనిపించని వాస్తవం.
ఈ పరిస్థితిల్లో చంద్రబాబుని ఆదుకునేది బిజెపి పొత్తులో ఉన్న పవన్ కళ్యాణా లేక జూనియర్ ఎన్టీఆరేనా అన్నది ఆయనే తేల్చుకోవాలి. కేవలం చంద్రబాబు నాయుడుకు ఉన్న అభిమానాన్ని వాడుకుని, ఈ ఎన్నికల్లో గట్టెక్కాలని టీడీపీ భావిస్తున్నట్లు ఉంది. లోకేష్ తనను తానూ నిరూపించుకోవడానికి పాదయాత్రతో అవకాశం వచ్చింది.
ఇవి కూడా చదవండి: 18 నెలల్లో 108 కేజీల వెయిట్ తగ్గించిన అనంత్ అంబానీ ట్రైనర్ గురించి ఈ విషయాలు తెలుసా? ఇతని ఫీజ్ ఎంతంటే?
కానీ ఆయన దాన్ని అధికార పార్టీని తిట్టడానికి మాత్రమే వినియోగించారు. దీనితో ఆయన ప్రతీకార రాజకీయాలు చేస్తారు అని ప్రజల్లో ఇన్ డైరెక్ట్ గా వెళ్లినట్లు అయ్యింది. పవన్ తో పొత్తు కంటే.. ఎన్టీఆర్ మనసుకి అయ్యిన గాయాన్ని ఓదార్చి ఆయనకు బాధ్యతలు అప్పగిస్తే.. టీడీపీ పరిస్థితి మెరుగవుతుందేమో అన్న ఆలోచన చాలా మందిలో ఉంది.
అయితే లోకేష్ ప్రాధాన్యత తగ్గడం అటు సిబిఎన్ కు ఇటు బాలకృష్ణకు ఇద్దరకీ ఇష్టం లేదు. అందుకే ఎన్టీఆర్ ను దూరం పెడుతున్నారన్న అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. అయితే.. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు మరింత ఆలోచించుకోవాల్సింది ఉంది అంటూ పద్మాకర్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.