Advertisement
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం రేవంత్ రెడ్డి చాలానే కష్టపడ్డారు. కాంగ్రెస్ లాంటి పార్టీల్లో పలుకుబడి తెచ్చుకుని రాణించాలంటే ఢిల్లీలో బడా నాయకుల సపోర్ట్ కూడా ఎంతో కొంత అవసరమే. మనలో టాలెంట్, దమ్ముతో పాటు బడాబాబుల సహకారం కూడా ఉండాల్సిందే. అయితే.. ఇటీవల యూట్యూబ్ లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎంపీ దీపేందర్ హూడా ఇంటికి వెళ్లడం, ఇంట్లో వారు ఆశీర్వదించడం, దీపేందర్ హూడా కూడా రేవంత్ రెడ్డిని ఆలింగనం చేసుకుని విషెస్ చెప్పడం కనిపిస్తుంది.
Advertisement
దీనితో అందరికి ఆలోచన మొదలైంది. అసలు ఈ దీపేందర్ హూడా ఎవరు? ఆయనకు రేవంత్ రెడ్డి కి ఎలా పరిచయం ఉంది? అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. వారిద్దరి మధ్య దోస్తీ కుదరడం రాజకీయ వర్గాల్లో ఇంటరెస్టింగ్ టాపిక్ అయ్యింది. రేవంత్ రాజకీయ నాయకుడిగా ఎదగడానికి చాలానే కష్టపడ్డారు. ఎంత ప్రయాస పడ్డా చివర్లో సీఎం అవ్వకుండా ఉండడానికే కాంగ్రెస్ లోని సెంటర్ నేతలే చాలా ప్రయత్నాలు చేసారు. ఆ సమయంలో కూడా రేవంత్ రెడ్డి గట్టిగానే ఫైట్ చేసారు.
Advertisement
ఈ టైం లోనే హుడా సహకారం రేవంత్ రెడ్డికి ప్లస్ పాయింట్ అయ్యిందని చెప్పచ్చు. ఇంతకీ ఈ దీపేందర్ హుడా ఎవరు అన్న విషయానికి వస్తే.. రోహ్ తక్ నియోజక వర్గానికి చెందిన వ్యక్తి. మూడుసార్లు లోక్ సభ ఎంపీగా గెలిచారు. ఆయన తండ్రి భూపేందర్ సింగ్ కూడా రెండు సార్లు హర్యానా ముఖ్యమంత్రిగా పనిచేసారు. దీపేందర్ హుడా మంచి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి. ఆయన తాత రణబీర్ సింగ్ హుడా కూడా రెండు సార్లు రోహ్ తక్ నియోజక వర్గంలోనే ఎంపీగా గెలిచారు. అప్పటికి పంజాబ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది. ఆ రాష్ట్రానికి మంత్రిగా కూడా పని చేసారు. ఆయన తండ్రి చౌదరి మాతు రామ్ కూడా ఓ ఫ్రీడమ్ ఫైటర్. ఆయన మహాత్మా గాంధీతో కూడా కలిసి పని చేశారట. ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక దీపేందర్ భార్య శ్వేతా మిర్డా కూడా నాథూరామ్ మిర్దా అనే ఓ కాంగ్రెస్ నాయకుడి మనమరాలు. ఎటు చూసినా ఆయనకు పొలిటికల్ సపోర్ట్ బాగానే ఉంది. రాహుల్ గాంధీకి బాగా కావాల్సిన వ్యక్తి దీపేందర్ హుడా.
Read More:
చిన్న వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు! వీళ్ళు ఎవరు ? ఎవరు ఎంత వయసంటే ?
క్రికెట్ లో డక్ అవుట్ అనే పేరు ఎలా వచ్చింది? ఎందుకు పెట్టారంటే ?
రేవంత్ రెడ్డిపై కెసిఆర్ సర్కార్ కి ఇంత కక్ష ఉందా? రేవంత్ రెడ్డి పై అన్ని కేసులు పెట్టారా?