Advertisement
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. ఇతని సినిమాలలో స్టైలిష్ టేకింగ్, హెల్దీ కామెడీ తో పాటు అద్భుతమైన డైలాగులు కూడా ఉంటాయి. రొటీన్ కథనే అయినప్పటికీ తనదైన శైలిలో ప్రజెంట్ చేసి హిట్లు అందుకోవడంలో త్రివిక్రమ్ దిట్ట. తన సినిమాలతో అన్ని వర్గాల వారిని అలరిస్తూ టాప్ దర్శకుల లిస్టులో చేరిపోయారు త్రివిక్రమ్. ఈయన దర్శకత్వంలో వచ్చిన జులాయి, అతడు, అత్తారింటికి దారేది, అల వైకుంఠపురం సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.
Advertisement
Read also: తన భార్య రాక కోసం ఎదురు చూసే భర్త ! ఒక అందమైన ప్రేమ జంట కథ !
ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబుతో భారీ బడ్జెట్ చిత్రాన్ని చేస్తున్నారు. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. త్రివిక్రమ్ భార్య పేరు సౌజన్య. ఈమె స్వతహాగా ఒక డాన్సర్ అని మాత్రం ఆ మధ్య ఒక స్టేజి ప్రదర్శన ఇచ్చిన తర్వాత అందరికీ తెలిసింది. అయితే త్రివిక్రమ్ భార్య సౌజన్యకు సంబంధించిన కొన్ని విషయాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. త్రివిక్రమ్ భార్య సౌజన్య సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మేనకోడలు. వీరిది పెద్దలు కుదిరిచ్చిన వివాహమే. 2002లో వీరి వివాహం జరిగింది.
Advertisement
వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సౌజన్య కేవలం హౌస్ వైఫ్ మాత్రమే కాదు చాలా టాలెంటెడ్ వుమెన్. ఈమె ఒక క్లాసికల్ డాన్సర్. ఇప్పటికే ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చారు. మూడేళ్ల క్రిందట రవీంద్ర భారతి లో డాన్స్ చేసే వరకు త్రివిక్రమ్ భార్య సౌజన్య ఇంత మంచి డాన్సర్ అనే విషయం ఎవరికీ తెలియలేదు. 2018లో ఈమె రవీంద్రభారతిలో భరతనాట్యం డాన్స్ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు.
Read also: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దగ్గర ఉన్న అతి విలువైన వస్తువులు వీటి ధరలు ఎంతంటే ?