Advertisement
రాజకీయాలు కాలానికి తగ్గట్లు మారుతూ వచ్చినా.. కొన్ని అంశాలు మాత్రం చరిత్రలో నిలిచిపోతాయి. కొన్ని సంఘటనలను, కొన్ని ఫోటోలను, కొన్ని బంధాలను, కొందరు మనుషులను అంత త్వరగా మర్చిపోలేం. రాజకీయాల్లో అలాంటి వ్యక్తే ఎన్టీఆర్ కూడా. ఆయనతో పని చేసిన రాజకీయ నాయకులకు ప్రత్యేక అనుభూతులు, అనుబంధాలు ఉంటాయి. అలాంటి ఓ వ్యక్తి ఈ కింద కనిపిస్తున్న ఫొటోలోని వ్యక్తి కూడా. ఎన్టీఆర్ పక్కన కనిపిస్తున్న ఈ వ్యక్తి ఓ పాపులర్ రాజకీయ నాయకుడు. ఎవరో గుర్తుపట్టారా? ఆయన ఎవరో కాదు.. తుమ్మల నాగేశ్వర్రావు గారు.
Advertisement
ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న తుమ్మల నాగేశ్వర్రావు గారు ఎన్టీఆర్ గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. కులానికి సంబంధించి.. ఆయనకు ఎన్టీఆర్ కు మధ్య జరిగిన ఓ సంభాషణ గురించి చెప్పుకొచ్చారు. తుమ్మల గారు 1982 నుండి, ప్రతి సంవత్సరం కమ్మ సంఘం సమావేశానికి ప్రజా ప్రతినిధిగా హాజరు అవుతూ ఉంటారట. కమ్మగా పుట్టడం నా అదృష్టం, పునాది రాయి కూడా అని ఆయన చెబుతుంటారు. ఓ సారి అమీర్‌పేట కమ్మ సంఘం వేడుకకు మొత్తం 50 మంది శాసన సభ్యులు ఉన్నప్పటికీ నేను ఒక్కడినే హాజరు అయ్యాను.
Advertisement
నేను మంత్రి అయిన మూడు నెలల తరువాత ఈ విషయం గురించి ఎన్టీఆర్ నన్ను ప్రశ్నించారు. ఈ సమావేశానికి ఎందుకు వెళ్లారు అంటూ అడిగారు. నేను ఆ కులంలోనే పుట్టానని.. అందుకు గర్వ పడుతూ ఉంటాను కాబట్టే వెళ్లానని చెప్పను. నిజానికి ఇలా వెళ్లడం వలన ఆ ప్రభావం పార్టీ పై చెడుగా పడుతుందేమో అనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ నన్ను అలా ప్రశ్నించారు. కానీ నేను సమాధానం చెప్పిన తరువాత ఎన్టీఆర్ లేచి నన్ను కౌగలించుకున్నారు. అలాంటి విచిత్రమైన వ్యక్తి ఎన్టీఆర్ గారు. కులాన్ని గౌరవించడంలో తప్పు లేదు.. కానీ ఇతర కులాలని దూషించమని చెప్పడం దీని అర్ధం కాదని ఎన్టీఆర్ వివరించారు. ఈ విషయమై మాట్లాడిన తుమ్మల నేను కులాన్ని చూసి బంధాన్ని పెంచుకొనని.. ఇప్పటికీ నా దగ్గర పని చేసే వారి కులాలు ఏంటో నాకు తెలియవని.. వ్యక్తుల తోనే బంధాలు పెంచుకుంటానని.. నా వర్కింగ్ స్టయిల్ అంతేనని చెప్పుకొచ్చారు.
Read More:
భువనేశ్వరి గారితో బాబు పెళ్లి నిశ్చయించిన తరువాత .. చంద్రబాబు ఎన్టీఆర్ తో కోరిన కోరిక ఏంటంటే ?
అసలు ఏమి మాట్లాడుతున్నావు రా నాయన? సలార్ గురించి ఈ కన్నడ స్టార్ ఇంత దిగజారి మాట్లాడాలా??