Advertisement
అయోధ్య రామ మందిర్ లో రాముల వారి విగ్రహావిష్కరణ జరుగుతున్న క్రమంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన రాముల వారి గురించిన చర్చలే నడుస్తున్నాయి. ఈ ఆర్టికల్ లో వెండితెరపై కనిపించిన రాముళ్ళ గురించి చూద్దాం. ఆ సీతారాముడి అద్భుత చరిత్రని వెండితెరపై చాలా సినిమాల్లో అద్భుతంగ తెరకెక్కించారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి.. లేటెస్ట్ గా ప్రభాస్ వరకు సినీ తెరపై రాముడిగా కనిపించిన వారి గిరినుంచి ఈ ఆర్టికల్ లో చూద్దాం.
Advertisement
ఎన్ని తరాలు గడిచినా.. ప్రజల్లో రామాయణం పట్ల ఉన్న ఆసక్తి తగ్గదు. ఇప్పటికీ కూడా రామాయణం పై సినిమాలు వస్తుండడమే అందుకు తార్కాణం. అలనాటి తరంలో రాముడంటే ఎన్టీఆర్ నే అన్నట్లుగా ఆజానుబాహుడు సీనియర్ ఎన్టీఆర్ రాముడిగా, కృష్ణుడిగా నటించి అందరిని మెప్పించారు. రీసెంట్ గా ఆరడుగుల అందగాడు ప్రభాస్ కూడా ఆదిపురుష్ లో రాముడిగా కనిపించి అలరించారు. తాజాగా అల్లు అరవింద్ కూడా రామయాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణాసురుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
Advertisement
ఇక సీనియర్ ఎన్టీఆర్ రాముడిగా, కృష్ణుడిగానే కాకుండా రావణాసురుడిగా కూడా నటించి మెప్పించారు. సంపూర్ణ రామాయణం, శ్రీరామ పట్టాభిషేకం, రామాంజనేయం యుద్ధం వంటి సినిమాల్లో ఎన్టీఆర్ రాముడిగా నటించి మెప్పించారు. “శ్రీరామ పాదుకా పట్టాభిషేకం” అనే సినిమా తొలిసారి రామ గాధని వెండితెరపై చూపించింది. ఎన్టీఆర్ తరువాత చాలా మంది రాముడి పాత్రల్లో నటించారు. కొందరు మెప్పించారు. మరికొందరు పర్వాలేదనిపించారు.
- బాలయ్య బాబు కూడా శ్రీరామరాజ్యం సినిమాలో రాముడిగా నటించి మెప్పించారు.
- జూనియర్ ఎన్టీఆర్ కూడా బాల రామాయణం సినిమాలో బాల రాముడిగా నటించి మెప్పించారు. ఒకరకంగా తారక్ రాముడి పాత్రతోనే తన కెరీర్ ని స్టార్ట్ చేసారు.
- అలాగే శ్రీకాంత్ కూడా దేవుళ్ళు సినిమాలో రాముడిగా కనిపించి మెప్పించారు.
- ఇక దేవుళ్ళ క్యారెక్టర్లు ఎక్కువగా వేసే సుమన్ కూడా శ్రీ రామ దాసు సినిమాలో భద్రాద్రి రాముడిగా కనిపించి మెప్పించారు.
- సంపూర్ణ రామాయణం సినిమాలో శోభన్ బాబు కూడా రాముడి పాత్రలో నటించి మెప్పించారు. ఆ తరానికి కాదు..
- ఈ తరానికి కూడా శ్రీరాముడు ప్రియుడే. ఆయనకు మరోసారి పట్టాభిషేకం జరగబోతోంది. బాలరాముడిని అయోధ్యలో ఈ జనవరి 22 ప్రతిష్ట చేయనున్నారు. ఈ ఉత్సవం కోసం యావత్ భారత దేశం ఎదురు చూస్తోంది.