Advertisement
తెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోగా ప్రత్యేకమైన మాడ్యూలేషన్, డైలాగ్ డెలివరీ తో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను, అభిమానులను సంపాదించుకున్నారు కృష్ణంరాజు. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు ఇప్పటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని చెప్పాలి. ఈయన కేంద్రంలో వాజ్పేయి మంత్రివర్గంలో కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే గతేడాది సెప్టెంబర్ 11వ తేదీన అనారోగ్య సమస్యల కారణంగా కృష్ణంరాజు గారు తుది శ్వాస విడిచారు.
Advertisement
Read also: ఆ ప్రాంతంలో జీడీపప్పు కేవలం 30 రూపాయలు మాత్రమే నట ఎక్కడంటే ?
దీంతో ప్రభాస్ పై కుటుంబానికి సంబంధించిన కీలక బాధ్యతలు పడినట్లు అయింది. ఇప్పుడు కృష్ణంరాజు గారి కూతుర్లకు దగ్గరుండి పెళ్లిళ్లు చేయాల్సిన బాధ్యత ప్రభాస్ దే అన్న సంగతి తెలిసిందే. అయితే కృష్ణంరాజు గారు ఏనాడు ప్రభాస్ ని తమ్ముడి కొడుకులా చూడలేదు. ప్రభాస్ సినీ కెరీర్ ని దగ్గరుండి చక్కదిద్ది పాన్ ఇండియా స్టార్ ను చేసి కన్నుమూశారు. ఇక కృష్ణంరాజు గారి భార్య శ్యామలాదేవి కూడా ప్రభాస్ ను సొంత కొడుకు కంటే ఎక్కువగా చూస్తూ వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా రెబల్ స్టార్ ఫ్యామిలీలో కలతలు మొదలయ్యాయి అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. ఇన్నాళ్లు చాలా అన్యోన్యంగా ఉన్న ప్రభాస్.. ప్రభాస్ చెల్లెలు ఇప్పుడు ఆస్తి విషయంలో తగాదాలు వేసుకుంటున్నారట
Advertisement
దానికి గల కారణం కృష్ణంరాజు సంపాదించిన దాంట్లో తన పిల్లలతో పాటు ప్రభాస్ కు కూడా కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి ఆస్తి సమానంగా రాసిందట. దీంతో సొంత కూతుర్లు ఉండగా ప్రభాస్ కి ఆస్తి రాయడమేంటని కృష్ణంరాజు ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన ఓ వ్యక్తి చిచ్చు పెట్టాడట. దీంతో ప్రభాస్ కుటుంబంలో మనస్పర్ధలు మొదలయ్యాయని తెలుస్తోంది. పిల్లలకు ఉన్నవి లేనివి చెప్పి వాళ్లను ప్రభాస్ పై రెచ్చగొట్టే విధంగా పంపుతున్నాడట. అయితే ఈ విషయంలో ఎవరి జోక్యం అవసరం లేదని శ్యామలాదేవి కరాకండిగా చెప్పేసిందట. దీంతో శ్యామలాదేవికి ప్రభాస్ పై అంత నమ్మకం ఉందని ఫ్యాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు.
Read also: ANCHOR SHYAMALA PHOTOS: ఒక్కాసారిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన యాంకర్ శ్యామల ! ఫోటోలు వైరల్!