Advertisement
ఒకసారి కొన్ని కాంబినేషన్లు బాగా హిట్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకు అల్లు అర్జున్ సుకుమార్, రవితేజ పూరి జగన్నాథ్, పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ఇలా. అప్పట్లో ఎన్నో సినిమాలు చేసిన వారు ఇప్పుడు పలు కారణాల వలన తమ బంధాలను బ్రేక్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పలు పండగలు లాంగ్ వీకెండ్స్ సమయంలో అధిక సంఖ్యలో మూవీస్ వచ్చి క్లాష్ అవ్వడం అనేది ఎప్పటినుండో చూస్తున్నాం. ఇప్పుడు ఈ ఏడాది సంక్రాంతికి కూడా పెద్ద సినిమాలు వచ్చి అదరగొట్టేలా కనపడుతున్నాయి.
Advertisement
ఈ ఏడాదిలో కొంచెం బిగ్ క్లాష్ ఏదైనా ఉంది అంటే అది ఆగస్టు 15 క్లాష్ అని చెప్పొచ్చు. ఈ డేట్ లో మూడు సినిమాలు రావాల్సి ఉంది పుష్ప టు రావాల్సి ఉంది కానీ పోస్ట్ పోన్ చేసారు. ఆ డేట్ ని ఫైనల్ గా నాలుగు చిత్రాలు సొంతం చేసుకున్నాయి. మళ్లీ చాలా కాలం తర్వాత ఒక సాలిడ్ క్లాష్ పడబోతోంది. ఇందులో రెండు సినిమాలు విషయంలో మాత్రం మంచి రసవత్తర వాతావరణం కనపడబోతోంది. అవే రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ పోతినేని డబల్ ఇస్మార్ట్. డబల్ ఇస్మార్ట్ మేకర్స్ మాత్రం రవితేజ హరీష్ శంకర్ విషయంలో మొదటి నుండి గుర్రుగానే ఉన్నారు.
Advertisement
Also read:
చార్మి రవితేజని హరీష్ శంకర్ ని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం చర్చకు దారి తీసింది. ఇప్పుడు దీనికి నుంచి షాక్ ఉందా అంటే అది రవితేజ పూరి జగన్నాథ్ మధ్య మాటలు లేకపోవడం అని తెలుస్తోంది. ఇద్దరి కాంబినేషన్లో అప్పట్లో ఎలాంటి సినిమాలు వచ్చాయో అందరికీ తెలుసు. ఇలాంటి ఓ కాంబినేషన్ మధ్య ఈ ఆగస్టు బాక్స్ ఆఫీస్ చిచ్చు పెట్టింది. డబల్ ఇస్మార్ట్ ట్రైలర్ లాంచ్ లో పూరి జగన్నాథ్ పై వేసిన స్పెషల్ ఏవి లో రవితేజతో చేసిన సినిమాలను తప్పించడం షాకింగ్ గా మారింది. దీంతో వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. ఫ్యాన్స్ మాత్రం ఇది తీసుకోలేకపోతున్నారని చెప్పాలి. ఎన్నో సాలిడ్ సినిమాలు చేసిన వీరు ఇప్పుడు దూరంగా ఉండడం బాధాకరమైన విషయమే.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!