Advertisement
విజయ్ కాంత్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. విజయ్ కాంత్ అందరికీ సుపరిచితమే. తెలుగు ప్రేక్షకులకి కూడా విజయ్ కాంత్ బాగా సుపరిచితం. విజయ్ కాంత్ ఆరోగ్యం బాగోకపోవడంతో ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అయితే తిరిగి ఆయన కోల్కొని ఇంటికి క్షేమంగా వస్తారని అంతా అనుకున్నారు. కానీ కరోనా కారణంగా విజయ కాంత్ మృతి చెందారు విజయ్ కాంత్ మరణం తెలుగు తమిళ ప్రేక్షకులకు తీరని లోటు. కెప్టెన్ విజయ కాంత్ మృతదేహానికి నివాళులు అర్పించడానికి చాలామంది సెలబ్రిటీలు వచ్చారు. విజయ్ కూడా వెళ్లారు.
Advertisement
డిసెంబర్ 28 రాత్రి విజయ కాంత్ మృతదేహానికి నివాళులర్పించడానికి విజయ్ వెళ్లారు. విజయ్ కాంత్, విజయ్ మధ్య బాండింగ్ బాగుండేది. విజయ్ మూవీస్ లోకి రావడానికి విజయ్ కాంత్ సహాయం చేశారు. విజయ్ కాంత్ ముందే చిన్నప్పటినుండి కూడా విజయ్ పెరగారట. ఆయన్ని గాడ్ ఫాదర్ గా విజయ్ భావించేవారు. ఇరు ఫ్యామిలీలు కూడా అప్పుడప్పుడు బయట కలుసుకునేవారు కూడా. విజయ్ కాంత్ హీరో అవ్వడానికి విజయ్ తండ్రి ఎస్సే చంద్రశేఖర్ కారణమని చెప్పొచ్చు. విజయ్ కాంత్ హీరోగా ఇండస్ట్రీ లోకి వద్దామని అనుకున్నారు. కానీ చాలా మంది దర్శకులు విజయకాంత్ హీరో ఏంటి అని అవకాశాన్ని ఇవ్వలేదు.
Advertisement
కానీ ఎస్సే చంద్రశేఖర్ మాత్రం విజయకాంత్ కి హీరోగా అవకాశాన్ని ఇచ్చారు. ఇది ఇలా ఉండగా విజయ్ కాంత్ మృతదేహాన్ని చూసే విజయ్ కంట తడి పెట్టుకున్నారు తర్వాత కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. విజయ్ రావడంతో ఆయన చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. సెక్యూరిటీ ఆపినా కూడా అభిమానులు అస్సలు ఆగలేదు. విజయ్ ని తాకడానికి జనాలు ఎక్కబడ్డారు ఒక గుర్తు తెలియని వ్యక్తి విజయ్ మీదికి చెప్పు విసిరాడు అది విజయ్ కి తగల్లేదు కొద్దిలో మిస్ అయిపోయింది. ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. అజిత్ ఫ్యాన్స్ ఇలా చేసి ఉంటారేమో అని అంతా అన్నారు కానీ అజిత్ ఫ్యాన్స్ ఇలా చేయలేదని తెలుస్తోంది. విజయ్ కాంత్ విజయ్ కెరీర్ కోసం సొంత డబ్బును కూడా ఖర్చు పెట్టారట అయితే రాజకీయాల్లో విజయకాంత్ వెనుకబడిన కూడా విశేష సపోర్ట్ చేయలేదు బహుశా ఈ కారణం వల్లనే ఇలా జరిగి ఉంటుందని అంత భావిస్తున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!